ఆయనకు బాగా లేదని చెప్పే అవకాశం లేదు : వరలక్ష్మి

హీరోయిన్‌ గా కంటే విలన్‌ గా లేదంటే కీలక క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి కనిపిస్తున్నారు.

Update: 2024-04-24 11:44 GMT

తమిళ సీనియర్ స్టార్‌ శరత్‌ కుమార్‌ నట వారసురాలుగా ఆయన కూతురు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఈమె సందడి ఎక్కువగా కనిపిస్తోంది. హీరోయిన్‌ గా కంటే విలన్‌ గా లేదంటే కీలక క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి కనిపిస్తున్నారు.

ఇటీవల తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్‌ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించిన విషయం తెల్సిందే. తెలుగు లో వరలక్ష్మి వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె శబరి అనే సినిమాలో నటించింది.

తెలుగు తో పాటు తమిళం ఇతర భాషల్లో విడుదల అవ్వబోతున్న శబరి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్‌ కుమార్ తన కాబోయే భర్త నికొలయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

మీ సినిమాల గురించి నికొలయ్ ఎలా స్పందిస్తారు అంటూ వరలక్ష్మిని ప్రశ్నించిన సమయంలో ఆమె... బాగుంటే బాగుందని చెప్తాడు, బాగా లేకుంటే బాగా లేదని చెప్తాడు. అయితే ఇప్పటి వరకు ఆయనకు బాగా లేదని చెప్పే అవకాశం ఇవ్వలేదు అని నవ్వేసింది.

ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. వీరి వివాహం వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా తన సినీ కెరీర్ కొనసాగుతుందని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News