వరుణ్ తేజ్.. చావునే చెండాడు ధీరుడు
ఇక ఈసారి అతను ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కథను ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అందుకే అతని ప్రతి సినిమా కూడా ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా హైలైట్ అవుతూ వస్తోంది. ఇక రిజల్ట్ సంగతి పక్కన పెడితే మాత్రం వరుణ్ తేజ్ నటుడిగా కూడా ప్రతి సినిమాలో కొత్త తరహా కోణాన్ని బయటపెడుతూ ఉన్నాడు. ఇక ఈసారి అతను ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆపరేషన్ వాలెంటైన్ అనే ఈ సినిమాను శక్తి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సోనీ పిక్చర్స్ భారీ స్థాయిలోనే ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ విడుదల తేదీ మార్చుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్న క్రమంలో వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమాలోని హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే వందేమాతరం అనే పాటను విడుదల చేశారు. చూడరా సంగ్రామ షూరుడు.. అంటూ సాగే ఈ పాటలో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా అగ్రేసివ్ గా ఉండబోతున్నట్లు తెలియజేశారు. చావునే చెండాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. అనే లైన్స్ కూడా పాటలో మరింత హైలెట్ అయ్యాయి.
అలాగే మేకింగ్ విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ చేస్తున్న మొట్ట మొదటి సినిమా ఇదే. పాటలోని సారాంశం బట్టి హీరో క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది. మిక్కీ జె మేయర్ స్వర కల్పనలో వచ్చిన ఈ పాటను కునల్ కుండు పాడగా రామజోగయ్య శాస్ట్రీ లిరిక్స్ అందించారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ స్పెషల్ వెకేషన్స్ అలాగే ఫ్యామిలీ లైఫ్ కోసం ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్నాడు.
ఇక నెక్స్ట్ అతను హిందీ తెలుగులో ఒకేసారి విడుదల కానున్న యాక్షన్ డ్రామా, 'ఆపరేషన్ వాలెంటైన్' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా మానుషి చిల్లర్ నటిస్తోంది. ఎయిర్ ఫోర్స్ హీరోల అలుపెరగని పోరాటాన్ని సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇక సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలోకి రాబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.