బూతు సినిమాలో చెయ్యమని చెప్పాడా?

Update: 2015-10-17 09:30 GMT
డైసీ షా.. హీరోయిన్ గా అరంగేట్రంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ పక్కన నటించింది. జైహో చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ భామ ఏకంగా సీగ్రేడ్ బూత్ చిత్రంతో జనాల ముందుకొస్తోంది. హేట్ స్టోరీ3 పేరుతో తెరకెక్కుతున్న ఓ అడల్ట్ ఫిలిం.. కంటెంట్ విషయంలో ఇప్పటివరకూ భారత్ లో వచ్చిన బూతు సినిమాల రికార్డులను.. చెరిపేస్తుందనే అంచనాలున్నాయి. గతంలో వచ్చిన రెండు హేట్ స్టోరీలలోనూ బూతు శృతిమించిన స్థాయిలోనే ఉన్నా.. ఈ మూవీ ఇంకా రంజుగా ఉంటుందని తెలుస్తోంది.

డైసీషా ని రెండు వైపుల నుంచి పట్టుకున్న మేల్ కేరక్టర్ల రిలీజ్ చేసిన పోస్టర్లే.. కామన్ ఆడియన్స్ ని చిరాకు పెట్టించేశాయి. మరి సినిమాలో కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అని ఆశ్చర్యపోతున్నారు బాలీవుడ్ జనాలు. సల్మాన్ ఖాన్ హీరోయిన్ ఇంత దిగజారిపోయిన సినిమాలో చేయడమా అని అనుకుంటున్నారు. అయితే.. ఈ మూవీలో చేయాల్సిందిగా సల్లూభాయ్ ప్రోత్సహించాడని చెప్తోంది డైసీషా. ఈ జోనర్ తనకు కంఫర్టబుల్ కాకపోయినా.. జైహో తర్వాత ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని సల్మాన్ చెప్పడంతో.. ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేసిందట.

ఇది ప్రచారం కోసం చెప్తున్నట్లుగానే ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు. తన సినిమాల్లోనూ, తను నిర్మించే మూవీస్ లోనూ కనీసం లిప్ టు లిప్ కిస్ పెట్టుకునే సీన్స్ కూడా లేకుండా జాగ్రత్త పడే తత్వం కండలవీరుడిది. అదేమంటే తాను కంఫర్టబుల్ గా ఫీలవను అని చెబ్తాడు. మరి అలాంటి సల్మాన్ ఇలాంటి బూతు కంటెంట్ ఉండేలో చేయమని చెప్పాడని డైసీ షా అంటోంది. ఎంతవరకూ నమ్మచ్చో? 
Tags:    

Similar News