స్టార్ హీరోతో ఫైటింగ్.. నా కొడుకు కాబట్టే తట్టుకున్నాడు!
ఒక పెద్ద హిట్టు కొట్టాక కూడా ఆ హీరో ఏకంగా 14 నెలలు ఎలాంటి ఛాన్స్ దక్కకపోవడంతో నిరుద్యోగిగా ఉన్నాడు
ఒక పెద్ద హిట్టు కొట్టాక కూడా ఆ హీరో ఏకంగా 14 నెలలు ఎలాంటి ఛాన్స్ దక్కకపోవడంతో నిరుద్యోగిగా ఉన్నాడు. పని లేక తీరిగ్గా కూచోవాల్సి రావడంతో అతడు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అయితే అతడు అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు స్టార్ హీరో అక్షయ్ కుమార్ సలహా తీసుకున్నాడు. నెమ్మదిగా అతడు బుల్లితెర ప్రయత్నాల్లో సక్సెసై అటుపై తిరిగి పెద్ద తెరకు కంబ్యాక్ అయ్యాడు. షూట్ అవుట్ లోఖండ్‌వాలా లాంటి అవార్డ్ విన్నింగ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ లో నటించిన తర్వాతా తనకు అవకాశాలు రాకుండా చేసారని అతడు ఆరోపించాడు. తన ఒంటరితనం డిప్రెషన్ గురించి మీడియా ఎదుట ఓపెనయ్యాడు. ఒక ప్రముఖ హీరో తనను బెదిరించాడని కూడా మీడియా ఎదుట వెల్లడించాడు.
ఇంతకీ అతడు ఎవరు? అంటే.. ది గ్రేట్ వివేక్ ఒబేరాయ్. ఐశ్వర్యారాయ్ తో ప్రేమలో ఉన్న క్రమంలోనే సల్మాన్ ఖాన్ నుంచి అతడు తీవ్రమైన బెదిరింపులను ఎదుర్కొన్నాడని హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ అతడు తన ప్రేమకు కట్టుబడి బలంగా నిలబడ్డాడు. సూపర్ స్టార్ ని ఎదురించాడు. సల్మాన్ ఖాన్‌తో పోరాడుతున్న సమయంలో బలంగా నిలబడినందుకు వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకును అభినందించారు.
సల్మాన్ తో వివేక్ గొడవ అతడి కెరీర్‌లో చీకటి దశగా రికార్డులకెక్కింది. అతడు ఇదే విషయమై బయటకు వచ్చి విలేకరుల సమావేశాన్ని నిర్వహించాడు. ఐశ్వర్య రాయ్‌తో తన సంబంధం గురించి ప్రశ్నిస్తూ తనను సల్మాన్ ఖాన్ బెదిరించాడని పేర్కొన్నాడు. ఇదే విషయమై బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ తన కొడుకును అభినందించాడు. ఆ పోరాటం ద్వారా వివేక్ చాలా సంపాదించాడు.. అతని బలం పెరిగింది. ఇంకెవరైనా అయితే మద్యానికి బానిసలుగా లేదా డ్రగ్స్ బానిసలుగా మారేవారు. నిజానికి వివేక్ ని సినీ సహచరులు నిజంగా వ్యతిరేకించారు. మీడియా, సినీ పరిశ్రమలోని వ్యక్తులు, నటీనటులు కూడా వ్యతిరేకులుగా మారారు.. కొన్నిసార్లు ఎవరైనా చాలా త్వరగా విజయం సాధిస్తే ఇతరులు దానిని పాజిటివ్ గా తీసుకోలేరు... అని సురేష్ ఒబెరాయ్ వ్యాఖ్యానించారు.
సల్మాన్‌ఖాన్‌తో పోరాటం తర్వాత బాలీవుడ్ వివేక్ ఒబెరాయ్‌ని దూరం పెట్టింది. వివేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 14 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నానని, ఇది తనకు అత్యంత నిరాశ కలిగించిందని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వేరొక ఇంటర్వ్యూలో... నేను దాని నుండి బయటపడినందుకు చాలా సంతోషిస్తున్నాను అని తెలిపాడు. ``నేను ఒక రకమైన అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాను. దాని నుండి బయటపడ్డాను. కానీ అందరూ నాలాగా అదృష్టవంతులు కాలేరు...``అని ఒబెరాయ్ అన్నాడు. ఉద్యోగం లేని సమయం ఎంత నిరాశపరిచిందో కూడా అతడు తెలిపాడు.
నేను అనవసర విషయాల్లో తలదూర్చాను. చాలా లాబీలు.. చాలా అణచివేత కథలు - అలాంటిదే ప్రియాంక చోప్రా కూడా ఎదుర్కొన్నానని చెప్పింది. దురదృష్టవశాత్తు ఇది మా పరిశ్రమ ముఖ్య లక్షణంగా ఉంది. అది ఎంత నిరాశపరిచిందో నాకు తెలుసు. చాలా అలసిపోయాను.. నేను అప్పుడే షూట్ అవుట్ లోఖండ్‌వాలాలో అవార్డ్ విన్నింగ్, కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించానని పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత 14 నెలలుగా నేను ఏ పని చేయలేక ఇంట్లోనే కూర్చున్నాను! అని అన్నారు. రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ అద్భుతంగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.