యష్ టాక్సిక్ వేట మొదలయ్యేది ఎప్పుడంటే..
కేవలం యష్ అభిమానులకే కాకుండా ఇండియన్ సినిమాపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులందరికీ ఇది ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌గా నిలిచింది.;
కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్’ అనే విభిన్న శైలి టైటిల్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. కేవలం యష్ అభిమానులకే కాకుండా ఇండియన్ సినిమాపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులందరికీ ఇది ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. భారీ వర్షంలో నలిగిపోయిన లుక్‌తో, చేతిలో గన్ పట్టుకుని నడుస్తున్న యష్ పాత్ర పవర్ఫుల్ గా కనిపిస్తోంది. విపరీతమైన అగ్నికీలలు, మంటలు కనిపిస్తుండగా.. యష్ శరీరాకృతిలో ఉన్న షాడో అలానే స్పష్టంగా నిలిచింది. 2026 మార్చి 19న సినిమా థియేటర్లలోకి రానుందని పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఉగాది, ఈద్ వంటి పండుగల వారం కావడంతో అదే వారం విండోలో బాక్సాఫీస్ రేంజ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సినిమాను గీతు మోహన్‌దాస్ అనే ప్రఖ్యాత దర్శకురాలు తెరకెక్కిస్తుండగా, KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు, కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్‌నే చూసినా సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ఉండబోతోందని అర్థమవుతోంది. ముంబై నుంచి మలయాళం, తమిళం వరకు ఫేమస్ నటీనటుల బలంతో భారీ స్థాయిలో క్యాస్టింగ్ ఫిక్స్ చేశారు.
1970ల గోవా కర్ణాటక బ్యాక్‌డ్రాప్‌లో బ్రదర్ సిస్టర్ ఎమోషనల్ డ్రామాతో సాగనున్న ఈ కథకు హాలీవుడ్ టచ్ కూడా ఉండనుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ యాక్షన్ పార్ట్ డిజైన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మేకర్స్ కూడా తెలియజేశారు. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరిపే ఈ సినిమా, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదే మాస్ ప్లస్ అవుతుందన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
మొత్తానికి ‘టాక్సిక్’ అనే టైటిల్ వినగానే విభిన్నత ఊహించగలిగిన ప్రేక్షకులకు, ఈ పోస్టర్, ఈ రిలీజ్ డేట్ తో మరింత ఆసక్తిని కలిగించింది. యష్ మాస్ పరాకాష్టగా కనిపించే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కేజీఎఫ్ తరువాత యష్‌కి మళ్లీ అదే స్థాయి మార్కెట్ రిపీట్ అవుతుందా అన్నది ఆసక్తికర అంశం కానుంది.