యష్ నెక్స్ట్.. అందులో కూడా పవర్ఫుల్ గానే
రెండేళ్లకి పైగా విరామం తీసుకొని రీసెంట్ గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమాని స్టార్ట్ చేశారు.
రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. రెండేళ్లకి పైగా విరామం తీసుకొని రీసెంట్ గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రంలో నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వారు కూడా ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే మొదటి కన్నడ చిత్రం కావడం విశేషం.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ‘టాక్సిక్’ సినిమా కథాంశం డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందంట. డ్రగ్స్ సిండికేట్ చుట్టూ కథాంశం తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో కూడా రాకింగ్ స్టార్ యష్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడంట. అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది.
కేజీఎఫ్ సిరీస్ లో రాఖీభాయ్ రేంజ్ లోనే ‘టాక్సిక్’ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ ని గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ గా రాకింగ్ స్టార్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడంట. కచ్చితంగా అతని క్యారెక్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ ని సౌత్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ప్రెజెంట్ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కాంటెంపరరీ లైన్ లో ఈ సినిమా కథని దర్శకురాలు నేరేట్ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది.
అలాగే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో చాలా బలంగా ఉంటుందంట. అందుకే నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ని యష్ సిస్టర్ పాత్ర కోసం తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్ లో వర్క్ అవుట్ అయిన సెంటిమెంట్ ని ‘టాక్సిక్’ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారంట. ఎంత వైలెంట్ క్యారెక్టరైజేషన్ తో స్టోరీ చెప్పిన దానికి బలమైన సెంటిమెంట్ జోడిస్తేనే మూవీకి ప్రేక్షకాదరణ వస్తుంది. ‘కేజీఎఫ్’ సిరీస్ సక్సెస్ కి కారణం కూడా ఆ మదర్ సెంటిమెంట్ అనే మాట వినిపించింది.
‘టాక్సిక్’ లో సిస్టర్ సెంటిమెంట్ ని గీతూ మోహన్ దాస్ జోడించినట్లు తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంటే అదే డేట్ కి ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ కూడా వస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయా లేదంటే ‘టాక్సిక్’ వాయిదా పడే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.