యువ దర్శకుడు డైవర్స్ షాక్..!
అంతేకాదు ఈ డైరెక్టర్ డైవర్స్ ఇష్యూని మీడియాలో లీక్ అవ్వకుండా కూడా జాగ్రత్త పడుతున్నారట.
టాలీవుడ్ లో మరో డైవర్స్ షాక్ ఇస్తుంది. అయితే ఈసారి ఏ హీరో హీరోయినో కాదు యువ దర్శకుడు అది కూడా పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే అతను డైవర్స్ తీసుకుంటున్నాడని టాక్. ముందు నటుడిగా పరిచయమై ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన అతను లవ్ స్టోరీ సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ ఒక మంచి హిట్ తో కెరీర్ సూపర్ జోష్ లో ఉన్నాడు. తను ఇదివరకు తీసిన లవ్ స్టోరీస్ కు భిన్నంగా స్టార్ హీరోతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి హిట్ కొట్టాడు ఆ దర్శకుడు.
ఆ హిట్ క్రేజ్ తో మరో స్టార్ తో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఈలోగా అతని పర్సనల్ లైఫ్ ఇష్యూ హాట్ న్యూస్ గా మారింది. పెళ్లై కనీసం ఏడాది కూడా ముగియక ముందే అప్పుడే డైవర్స్ దాకా మ్యాటర్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఫ్యామిలీలో అసలు గొడవలకు కారణాలు ఏంటి.. ఎందుకు అతను డైవర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాడు అన్న విషయాలు మాత్రం బయటకు రావట్లేదు.
అయితే ఈ విషయం గురించి ఆ డైరెక్టర్ సన్నిహితులు మాత్రం అలాంటిది ఏమి లేదని చెబుతుండగా కొందరు మాత్రం అవును మ్యాటర్ డైవర్స్ దాకా వెళ్లిందని అంటున్నారు. డైరెక్టర్ డైవర్స్ ఇష్యూలో తప్పు ఎవరిది.
అసలు కొత్త జంట మధ్య విడాకులు తీసునేంతగా గొడవలు ఎందుకు వచ్చాయి. ఈ విషయంపై వారి వాదన ఎలా ఉంది అన్నది తెలియాల్సి ఉంది. హిట్ కొట్టిన డైరెక్టర్ కదా ఈ విషయం బయటకు తెలిస్తే రెప్యుటేషన్ దెబ్బ తింటుందని సైలెంట్ గా ఈ మ్యాటర్ క్లోజ్ చేయాలని చూస్తున్నారట ఫ్యామిలీ పెద్దలు.
అంతేకాదు ఈ డైరెక్టర్ డైవర్స్ ఇష్యూని మీడియాలో లీక్ అవ్వకుండా కూడా జాగ్రత్త పడుతున్నారట. డైరెక్టర్స్ తాము ఎంచుకున్న ప్రొఫెషన్ కోసం తమ పర్సనల్ లైఫ్ ని త్యాగం చేస్తుంటారు. కొన్నిసార్లు వారు తమ భాగస్వామికి నచ్చని విధంగా ప్రవర్తిస్తుంటారు. వాటిని అర్థం చేసుకుని ఉండగలిగితే వారి జీవితాలు బాగుంటాయి. మరి ఈ యువ దర్శకుడి డైవర్స్ వెనుక రీజన్స్ ఏంటన్నది త్వరలో బయటకు వస్తాయని చెప్పొచ్చు. త్వరలోనే ఈ డైరెక్టర్ తో ఒక స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుండగా ఇంతలోనే అతని డైవర్స్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.