చెన్నై మీటింగులో పాల్గొన్నోళ్లంతా దొంగలే: బండి బరాబర్ కామెంట్స్
తమిళనాడు రాజధాని చెన్నైలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంపై తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తమిళనాడు రాజధాని చెన్నైలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంపై తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై మీటింగులో పాల్గొన్న వాళ్లంతా దొంగలేనని అన్నారు. ఏం జరిగిందని ఇప్పుడు ముఠా అక్కడ పోగు బడ్డారని వ్యాఖ్యానించారు. ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియే చేపట్టలేదన్నారు. అసలు కేంద్రం ఇప్పటి వరకు దీనిపై ప్రకటనే చేయలేదన్నారు.
అలాంటప్పుడు.. ఈ `ముఠాకు` అంత తొందరెందుకని బండి అన్నారు. ``దొంగలు దొంగలు ఊళ్లు పంచు కున్నట్టు ఈ ముఠా జనాల సొమ్ము దోచుకునేందుకు ట్రై చేస్తోంది. దొంగలంతా ఒక్క దిక్కున చేరినట్టుం ది``అని బండి వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఎవరూ ఆవేశ పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి న అవసరం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు తగ్గబోవమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.
''అయినా.. ఈ దొంగలు ముఠా కట్టారు. ఏదో జరుగుతోందని ప్రజలను భ్రమించేలా చేస్తున్నరు. వీరి బుద్ధి ప్రజలకు తెలుసు. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోతున్నడు. అందుకే.. ముఠా రాజకీయాలు చేస్తున్నడు'' అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇక, తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని తిరిగి కట్టబెట్టే అంశంపైనా బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ చీఫ్ రేసులో లేనన్నారు.
అయినా.. బీజేపీ అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నయినా.. తామంతా స్వాగతిస్తామని చెప్పారు. తను గతంలోనూ టీ బీజేపీ చీఫ్‌గా వ్యవహరించానని చెప్పారు. అధ్యక్షులు తామే అయిపోయినట్టు కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారని.. ఇలాంటి వారిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందన్నారు. ఇప్పుడున్న గుర్తింపు.. పదవులు తనకు సరిపోతాయని బండి వ్యాఖ్యానించారు.