ఇండియన్ రైల్వేస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఆ రంగంలో.. చెప్పిందెవరంటే?

జెప్టో..బ్లింకిట్.. ఇన్ స్టా మార్ట్.. బిగ్ బాస్కెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్విక్ కామర్స్ కంపెనీల హవా అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

Update: 2024-11-23 08:30 GMT

జెప్టో..బ్లింకిట్.. ఇన్ స్టా మార్ట్.. బిగ్ బాస్కెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్విక్ కామర్స్ కంపెనీల హవా అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఐదేళ్ల క్రితం వీటిల్లో చాలా వరకు ఎవరికి తెలియనివే. అలాంటిది స్వల్ప వ్యవధిలో దూసుకెళుతున్న ఈ కంపెనీలు.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు నెలవుగా మారుతున్నాయి. అయితే.. వీటి కారణంగా కిరాణా షాపులు ప్రభావితం అవుతున్నాయన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు జెప్టో ఫౌండర్ ఆదిత్ పాలిచా. దేశంలో సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడేందుకు క్విక్ ఈ కామర్స్ కారణమన్న విమర్శలో అర్థం లేదని చెబుతున్నారు. క్విక్ కామర్స్ బిజినెస్ కారణంగా కిరాణా షాపులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేస్తున్నారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో కిరాణా.. గ్రహావసరాల వినియోగం 46 బిలియన్ డాలర్లుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ డేటా వెల్లడించింది.

ఇందులో క్విక్ కామర్స్ వాటా 5 బిలియన్ల కంటే తక్కువని.. అంటే కిరాణా షాపులకు 41 బిలియన్లు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ల వ్యవధిలో క్విక్ కామర్స్ బిజినెస్ 1500 శాతం పెరగనున్నట్లుగా పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లలో పండ్లు.. కూరగాయల ధరలు 20-30 శాతం వరకు అధికంగా ఉండటానికి కారణాల గురించి పాలిచా మాట్లాడుతూ.. నాణ్యతే కారణమని చెబుతున్నారు.

అంతేకాదు.. 100 శాతం కార్బైడ్ లేని.. రిఫ్రిజరేటెడ్ లో నిల్వ చేసిన జెప్టోలోని మామిబి పండును ఎగ్జాంఫుల్ గా చెబుతుననారు. రాబోయే రెండు.. మూడేళ్ల కాలంలో 300-400 మిలియన్ల భారీ మొత్తం ప్రత్యక్ష పన్నుల రూపంలో ఖజానాకు చేరుతుందని.. తమ సంస్థలోనే 3-4 లక్షల మంది డెలివరీ భాగస్వామ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో ఒక డెలివరీ భాగస్వామి నెలకు రూ.10వేల - 15వేల వరకు సంపాదిస్తుంటే.. ఇప్పుడు రూ.23 వేల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో భారతీయ రైల్వేస్ కంటే ఎక్కువ ఉద్యోగాల్ని క్విక్ కామర్స్ బిజినెస్ క్రియేట్ చేస్తుందని చెప్పటం గమనార్హం.

Tags:    

Similar News