యూఎస్ లో బ్రిడ్జిని ఢీ కొట్టిన నౌకలో అంతా భారతీయులే!

ఈ కార్గో షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారని.. వీరంతా భారతీయులేనని షిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది.

Update: 2024-03-27 05:56 GMT

అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకోవటం తెలిసిందే. భారీ నౌక ఒకటి బ్రిడ్జిని ఢీ కొనటం.. సదరు బ్రిడ్జి మొత్తం కుప్పకూలిపోవటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన కొత్త విషయం వెలుగు చూసింది. ఈ కార్గో షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారని.. వీరంతా భారతీయులేనని షిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది.

సింగపూర్ కు చెందిన గ్రీస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్గో నౌక ‘దాలీ’ కొలంబోకు బయలుదేరినన సంగతి తెలిసిందే. బాల్టిమోర్ నుంచి బయలుదేరిన ఈ నౌక అర్థరాత్రి దాదాపు ఒకటిన్నర గంటల సమయంలో బ్రిడ్జిని ఢీ కొనటం.. ఆ వెంటనే సదరు బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఇద్దరు పైలెట్లు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదం ఎందుకు జరిగందన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఈ ఘటనపై అమెరికా అధికారులు దర్యాప్తు షురూ చేశారు. ఈ సందర్భంగా నౌక్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు నౌకా సిబ్బంది సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వంతెన మీద ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో దాదాపు 20 మంది గల్లంతయ్యారు. వీరి కోసం వెతుకులాట సాగుతోంది. ఈ ఘటన కారణంగా రాకపోకలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News