బ్రేకింగ్... కిమ్స్ లో శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అర్జున్!

ఈ సమయంలో తాజాగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు అల్లు అర్జున్ వచ్చారు.

Update: 2025-01-07 04:47 GMT

"పుష్ప-2" సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో తాజాగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు అల్లు అర్జున్ వచ్చారు.

అవును... సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు ఇచ్చిన నోటీసులకు స్పందించి, బయలుదేరారు.

ఈ సమయంలో.. ఈ ఘటన జరిగిన తర్వాత, ఇటీవల రెగ్యులర్ బెయిల్ పొందిన అల్లు అర్జున్ తొలిసారిగా కిమ్స్ ఆస్పత్రికి రాబోతుండటంతో మరోసారి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... పోలీసులు ఇరువైపులా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

హాస్పటల్ వద్దకు అల్లు అర్జున్ చేరుకునే సరికే అప్పటికే దిల్ రాజు.. బాలుడిని పరామర్శించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో సుమారు 15 నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా బాలుడుని పరామర్శించి.. అతడి తండ్రి భాస్కర్ తోనూ మాట్లాడి ధైర్యం చెప్పినట్లు చెబుతున్నారు.

బాలుడిని పరామర్శించి, అతడి తండ్రి భాస్కర్ తో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ కిమ్స్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడే అవకాశంపై చాలా మంది ఆశాభావం వ్యక్తం చేసినా.. అలాంటిదేమీ లేకుండా అల్లు అర్జున్ ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు.

కాగా... సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు! ఈ మేరకు 18 మందిని ఈ వ్యవహారంలో నిందితులుగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. అందులో ఏ 11గా అల్లు అర్జున్ ను చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నాడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.. హోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇటీవల నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ పేట్ పోలీసుల అనుమతి తీసుకుని నేడు శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ కిమ్స్ కి చేరుకున్నారు.

Tags:    

Similar News