అమెజాన్ ఉద్యోగుల తిప్పలు తప్పవా?
అమెజాన్ సంస్థలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
అమెజాన్ సంస్థలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తరువాత పరిశోధకులు చేసి సర్వేలో సగం మంది వేర్ హౌస్ వర్కర్లు తిండికి, వసతికి తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అమెజాన్ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
అమెజాన్ ఉద్యోగుల పరిస్థితి మెరుగుపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తిండి కూడా సరిగా దొరకడం లేదు ఆకలితో అలమటిస్తున్నారు. చెల్లింపులు చేయడం లేదు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్ మెంట్ సెంటర్ తాజాగా జాతీయ అధ్యయనం చేసింది. 53 శాతం మంది మూడు నెలల్లో తిండికి కష్టాలు పడుతున్నారు.
అమెరికాలో రెండో అతిపెద్ద సంస్థ వాల్ మార్ట్. అమెరికాలో 29 శాతం వాటాను కలిగి ఉందని తెలుస్తోంది. అమెజాన్ వేర్ హౌస్ లో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లో మొత్తం 1484 మంది కార్మికుల నుంచి స్పందనలను తెలియజేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు డీలా పడుతున్నాయి. ఈనేపథ్యంలో పేరుగాంచిన కంపెనీలు దుర్భర స్థితిలోకి జారుకుంటున్నాయి. దీంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కంపెనీల కష్టాలతో ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థ ఇంత కష్టాలకు గురి కావడం దారుణం.
అమెజాన్ సంస్థ లావాదేవీలు సక్రమంగా కొనసాగుతున్నా ఉద్యోగుల భవితవ్యమే అగాధంలో పడింది. కార్మికుల శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవడం లేదు. ఇక ముందైనా సంస్థ ఉద్యోగుల భవిష్యత్ కోసం చర్యలు చేపట్టి వారి బాగోగులు చూడాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు.