అమెరికాలో హాట్ టాపిక్ గా ‘అమీ ట్రిప్’ జ్యోతిష్యం
ఆమె బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. న్యూయార్క్ వర్సిటీ నుంచి సోషల్ వర్కులో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత జ్యోతిష్యం మీద ఆసక్తితో దాన్ని అధ్యయనం స్టార్టు చేవారు.
జాతకాలు.. జ్యోతిష్యాల గురించి మన దేశంలో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. జ్యోతిష్యం మీద ఆసక్తి మన దేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఉంటుంది. అయితే.. మన మాదిరి ఎవరు పడితే వాళ్లు జ్యోతిష్యాన్ని చెప్పే వీల్లేదు. దానికి శాస్త్రీయంగా అధ్యయనం చేయటంతో పాటు.. లైసెన్సు పొందిన వారు మాత్రమే చెప్పే వీలుంది. ఇలా జ్యోతిష్యం చెప్పే ఒక మహిళ ఇప్పుడు అమెరికన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. ఆమె చెబుతున్న జోస్యాలు ఒకటి తర్వాత ఒకటిగా నిజం కావటమే. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చెప్పిన జోస్యాల్లో జరిగిన వాటి విషయాల్లోకి వెళితే.. ఆమెను ఫాలో కావాలన్న బావన కలుగటం ఖాయం.
నలభై ఏళ్ల అమీ ట్రిప్ జ్యోతిష్యాన్ని చెబుతుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జ్యోతిష్యురాలిగా మారారు. ఆమె నోటి వచ్చే జోస్యాలను నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల ఆమె తన జోస్యాన్ని చెప్పి పెద్ద సంచలనానికి తెర తీశారు. అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ వైదులొగుతారని అందరి కంటే ముందే చెప్పారు. తర్వాతి రోజుల్లో ఆమె చెప్పింది చెప్పినట్లు జరగటంతో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి.
ఆమె బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. న్యూయార్క్ వర్సిటీ నుంచి సోషల్ వర్కులో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత జ్యోతిష్యం మీద ఆసక్తితో దాన్ని అధ్యయనం స్టార్టు చేవారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రోలాజికల్ రిసెర్చ్ నుంచి ధ్రువీకరణ పొంది సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్ గా నిలిచారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాస్మిక్ రిసెర్చ్.. అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ లాంటి సంస్థలకు సేవలు అందించారు.
ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల రేసులోకి నిలిచిన కమలా హారిస్.. అమెరికా రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా ఎదుగుతారన్న జోస్యాన్ని చెప్పారు. తాజాగా ఆమె అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని జోస్యం చెబుతున్నారు. ఓవైపు సర్వేలు.. కమలాకు అనుకూలంగా ఉంటే.. అమీ మాత్రం ట్రంప్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఆమె జోస్యాలు చెప్పే క్రమంలో పలు వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ.. ఆమె జోస్యాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి నెలకొంది.