గ్రేటర్ పైనే టార్గెట్టా ?

గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో మెజారిటి నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అమిత్ నమ్ముతున్నారు.

Update: 2023-10-11 05:03 GMT

నవంబర్ 30వ తేదీన జరగబోయే ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్ బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా ప్రత్యేకించి ఢిల్లీనుండి మంగళవారం వచ్చారు. బహిరంగసభ తర్వాత సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో బీజేపీలోని ముఖ్యనేతలు, ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఎట్టి పరిస్ధితుల్లోను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటి నియోజకవర్గాలు గెలవాల్సిందే అని స్పష్టంగా చెప్పారట.

గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో మెజారిటి నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అమిత్ నమ్ముతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల సరళిని గమనించినా అమిత్ షా చెప్పిందాంట్లో లాజిక్కుందనే అనిపిస్తుంది. కాబట్టే గ్రేటర్ లో గెలుపుపై గట్టి పట్టుతో పనిచేయాలని కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్ తో పాటు సీనియర్ నేతలకు స్పష్టంగా చెప్పారట. అమిత్ షా టార్గెట్ పెట్టడం బాగానే ఉంది కానీ అసలు సమస్యలు పార్టీలో చాలానే ఉన్నాయి.

పార్టీని పట్టిపీడిస్తున్న సమస్యలు ఏమిటంటే పార్టీలో మునుపటి ఉత్సాహం ఎక్కడా కనబడటంలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అనేంత ముపుపటి ఉత్సాహం ఇపుడు సీనియర్లలో ఎవరిలోను కనబడటంలేదు. కాకపోతే అధికారంలోకి వచ్చేది తామే అని పదేపదే ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సీనియర్లకు కూడా బాగా తెలుసు. అయినా సరే అదో షో చేస్తుంటారంతే.

ఈ విషయం అమిత్ షా కు తెలీకుండానే టార్గెట్లు పెడుతున్నారా ? తెలుసు, అమిత్ షా కు కూడా బాగా తెలుసు. అయినా సరే ఎవరిస్ధాయిలో వాళ్ళు డ్రామాలు ప్లే చేస్తున్నారు. 119 నియోజకవర్గాలకు గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపే దిక్కేలేదు పార్టీకి. పార్టీలో చేరుతారని ఒకపుడు అనుకున్న నేతల్లో చాలామంది కాంగ్రెస్ లో చేరిపోయారన్న విషయం కూడా అమిత్ షా కు తెలుసు. అయినా అధికారంలోకి వచ్చేస్తోందనే హడావుడి చేయాలి కాబట్టి అందరు కలిసి నానా రచ్చ చేస్తున్నారు.

Tags:    

Similar News