సంతానలేమి ముప్పు దిశగా దేశం... 2050 నాటికి డేంజర్ న్యూస్!!

ఈ నేపథ్యంలోనే దేశం సంతానలేమి ముప్పు దిశగా వెళ్తోందని అంటున్నారు పరిశీలకులు.

Update: 2024-07-22 06:24 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమి సమస్య తీవ్రంగా ఉన్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. జననాల రేటు దారుణంగా పడిపోతుందని అంటున్నారు. ప్రధానంగా పిల్లలు వద్దనుకున్నవారి సంగతి పక్కనపెడితే.. పిల్లలు కలగాలని కోరుకునేవారిలో కోట్ల మందికి ఆ కోరిక తీరడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశం సంతానలేమి ముప్పు దిశగా వెళ్తోందని అంటున్నారు పరిశీలకులు.

అవును... మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, పని ఒత్తిడి మొదలైన సమస్యల కారణంగా సంతానలేమి సమస్య పెరిగిపోతుందని అంటున్నారు. ఈ సమయంలో... కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నవారు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) చేయించుకుంటున్నారు.. మిగిలిన వారు ఆ అవకాశాన్ని సైతం పొందలేకపోతున్నారు. తాజాగా ఈ విషయాలపై ఇందిరా ఐ.వీ.ఎఫ్. వ్యవస్థాపకులు డా. అజయ్ ముడియా స్పందించారు.

ఈ సందర్భంగా... సంతానలేమి ముప్పు దిశగా భారత్ వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో రాబోయే కొన్నేళ్లలో దేశ జనాభా సమీకరణలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. ఇదే సమయంలో... హార్మోన్ల సమస్యలు, పెరుగుతున్న మందుల వినియోగాలకు తోడు మారుతున్న జీవన శైలి కారణంగా భారత్ లో యువత ఈ వంధ్యత్వ సమస్యను ఎదుర్కొంటుందని తెలిపారు.

ఈ సమస్య మరింత విస్తరిస్తే దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగిపోతుందని అన్నారు. ఇప్పటికే పలు ఆసియా దేశాలు ఈ తరహా సవాల్లను ఎదుర్కొంటున్నాయని వివరించారు. ఈ పరిస్థితి మనకు రాకూడదంటే... ప్రభుత్వ మెటర్నరీ వైద్య నిపుణులకు ఐవీఎఫ్ చికిత్సా పద్దతులపై శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.

వాస్తవానికి మన దేశంలో ఏటా సుమారు 2.75 కోట్ల మంది పెళ్లి అయినవారు సహజంగా సంతానాన్ని పొందలేకపోతున్నరని.. వీరిలో కేవలం 2.75 లక్షల మంది మాత్రమే ఐవీఎఫ్ చికిత్స చేయించుకోగలుగుతున్నారని.. దేశంలోని ప్రతీ ఆరు జంటల్లో ఒకరికి ఈ సమస్య ఉందని అన్నారు. అందువల్ల... ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ ఐవీఎఫ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన సూచించారు.

మరోపక్క యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూ.ఎన్.ఎఫ్.పీ.ఏ.) షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... భారత్ లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెండింతలు అవుతుందని తెలిపింది. ఇదే క్రమంలో 60ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని వివరించింది. ఈ డేటా ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో.. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనంతో పాటు పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉందని ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారత అధ్యక్షురాలు ఆండ్రియా వొజ్నార్ పేర్కొన్నారు.

Tags:    

Similar News