వైఎస్సార్ ని గట్టిగా వాడుకుంటాం...!?
దీని మీద ఎలాంటి డౌట్లూ సందేహాలకు ఆస్కారం లేకుండా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అయిన మాణీక్కర్ ఠాకూర్ వైఎస్సార్ పేరుని తప్పకుండా వాడుకుంటామని నొక్కి చెప్పేశారు.
వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఊపిరులూదిన మేటి నాయకులు. పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొని చిక్కి శల్యమైన పరిస్థితి. అలాంటి కాంగ్రెస్ ని తన పాదయాత్రతో ప్రాణం పోసిన వారు వైఎస్సార్.
ఆయన బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. తెలంగాణా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కొన్ని చోట్ల ఆయన పేరుని జపించింది. ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ సొంత స్టేట్. దాంతో పాటు వైఎస్సార్ మవాడే అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో అంటోంది. ఇపుడు ఆయన బ్లడ్ కూడా కాంగ్రెస్ లో చేరింది.
ఆ పార్టీ తీర్ధాన్ని వైఎస్ షర్మిల తీసుకున్నారు. ఈ నేపధ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని ఏపీలో పైకి లేపే బాధ్యతలను కూడా తలకెత్తుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తన తండ్రి పేరుని ఆమె కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా పదే పదే ప్రస్తావించారు. తన తండ్రి వైఎస్సార్ ఉన్న పార్టీలో తాను చేరడం ఆనందం అని అన్నారు.
ఈ క్రమంలో వైఎస్సార్ పేరుని ఇంకా గట్టిగానే కాంగ్రెస్ ఏపీ రాజకీయాల్లో వాడేయబోతోంది అని అర్ధం అవుతోంది. దీని మీద ఎలాంటి డౌట్లూ సందేహాలకు ఆస్కారం లేకుండా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అయిన మాణీక్కర్ ఠాకూర్ వైఎస్సార్ పేరుని తప్పకుండా వాడుకుంటామని నొక్కి చెప్పేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ వాది అని ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అని మాణిక్కర్ ఠాగూర్ చెబుతున్నారు. ఎన్నికలలో ఆయన పేరుతోనే వెళ్తామని కూడా ఆయన అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ దే అధికారం అని కూడా చెబుతున్నారు.
దీంతో ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ బొమ్మ ఇపుడు అంతటా కనిపించబోతోంది అని అర్ధం అవుతోంది. వైఎస్సార్ బొమ్మతోనే వైసీపీ ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ అని కూడా పేరు పెట్టుకున్నారు. వైఎస్సార్ నే పార్టీ జెండా మీద కూడా ఉంచుకుంది.
అంటే గత పదేళ్ళుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ బొమ్మను బాగా వాడుకుంది. ఆనాడు కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ మావాడే అని ఎవరు అన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు వైఎస్సార్ తనయ షర్మిల అదే పార్టీలో ఉంటూ జనంలోకి వస్తే తప్పకుండా వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ తమ సొంతం అవుతుంది అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో వైఎస్సార్ అభిమానులు చాలా ఎక్కువగానే ఉన్నారు. వారంతా వైసీపీకి టర్న్ అయ్యారు. దాంతో ఇపుడు వైఎస్సార్ బొమ్మను జనంలో పెట్టుకుని కాంగ్రెస్ ముందుకు వెళ్లాలని చూడడం వెనక పోయిన తమ ఓటు బ్యాంక్ ని వెనక్కి తెచ్చుకోవడం కోసమే అవుతుంది అని అంటున్నారు.
అంటే ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం మరణించిన వైఎస్సార్ 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో హైలెట్ కాబోతున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ బొమ్మను పెట్టుకుని జనంలోకి అటు అధికార వైసీపీ ఇటు కాంగ్రెస్ కూడా వెళ్తాయని అంటున్నారు. అదే జరిగితే జనాలు వైఎస్సార్ ని ఏ పార్టీకి సొంతం అని భావించి తీర్పు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.