ఏపీలో అక్క‌డ మాత్రం పాల‌న అంత ఈజీ కాదా..?

రాష్ట్రంలో ఏడు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు ఉన్నాయి. వీటికి ఇంకా.. మ‌రో రెండేళ్ల పాటు కాల ప‌రిమితి ఉంది.

Update: 2024-06-25 07:35 GMT

రాష్ట్రంలో ఏడు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు ఉన్నాయి. వీటికి ఇంకా.. మ‌రో రెండేళ్ల పాటు కాల ప‌రిమితి ఉంది. ఈ రెండు సంవ‌త్స‌రాలు.. పాల‌న‌ను నెట్టుకురావాలి. అయితే.. ఇది అంత ఈజీనేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ ఏడు కార్పొరేష‌న్ల‌లోనూ.. వైసీపీ నేత‌లే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుండుగుత్త‌గా కార్పొరే ష‌న్ల‌ను వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ పాల‌న ఉన్న‌న్నాళ్లు కొంత వ‌ర‌కు బాగానే న‌డిచాయి. కానీ, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు వ‌చ్చింది. నిధుల వ్య‌వ‌హారం ప్ర‌శ్న‌గా మారింది.

దీనికితోడు.. వైసీపీ హ‌యాంలో కార్పొరేష‌న్ల‌లో కొంద‌రు కార్పొరేట‌ర్లే కాంట్రాక్టులు తీసుకున్నారు. కాలువ‌ల నిర్మాణం.. చిన్న‌పాటి ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తులు, నిర్మాణం, కార్పొరేష‌న్‌కు సంబంధించి చెత్త డంపింగ్ వంటి వి వారే చేసుకున్నారు. తొలి రెండేళ్లు నిధులు వ‌చ్చేసినా.. ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి ఆరు మాసా ల్లో నిధులు విడుద‌ల కాక‌.. కార్పొరేష‌న్ల నుంచి వీరికి సొమ్ములు చేజిక్క‌లేదు. దీంతో ఇప్పుడు స‌ర్కారుపై నే ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది.

కానీ, కూట‌మి స‌ర్కారు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తుందనేది ప్ర‌శ్న‌. దీంతో ఇప్పుడు కార్పొరేష‌న్లలో కుదుపులు వ‌స్తున్నాయి. మీకు మేం స‌హ‌క‌రిస్తాం.. మాకు మీరు స‌హ‌క‌రించండి! అంటూ.. కార్పొరేట‌ర్లు.. ఎమ్మెల్యేల కు అత్యంత ర‌హ‌స్యంగా స‌మాచారం పంపుతున్నారు. ప్ర‌స్తుతం ఇది ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉంది. అయితే.. స‌హ‌క‌రించ‌డం కాదు.. అస‌లు మీరు కండువాలే మార్చేసుకోవాల‌ని.. విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో అయితే.. ఒత్తిడి పెరిగిన‌ట్టు తెలుస్తోంది.

ఒక‌వైపు ప‌నులు చేసినందుకు నిధులు కావాలి. మ‌రో వైపు రెండేళ్లు నెట్టుకు రావాలి. ఈ నేప‌థ్యానికి తోడు వైసీపీ పూర్తిగా బ‌ర‌స్ట్ అయిపోయింది. ఈ నేప‌థ్యంలో పార్టీ మారిపోయినా.. ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితి ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాదు.. విశాఖ స‌హా అన్ని న‌గ‌ర పాల‌క సంస్థ‌ల్లోనూ క‌నిపిస్తోంది. అయితే..ఇప్ప‌టికిప్పుడు వ‌ద్ద‌ని మంత్రి వ‌ర్గం నెంబ‌ర్ 3 గా ఉన్న కీల‌క నాయకుడు ఒక‌రు సూచించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికిప్పుడు వారితో కండువాలు మార్పిస్తే.. బ్యాడ్ అవుతామ‌ని.. రెండు నెల‌లు వేచి ఉండాల‌న్న సూచ‌న‌లు అందాయ‌ని స‌మాచారం. మ‌రి త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News