జైలులో బాబు ఆరోగ్యం ఎలా ఉందంటే....?
బాబుకు వైద్యులు అందిస్తున్న వైద్యంతో పాటు వారు ఇస్తున్న వివరాలతో హెల్త్ బులెటిన్స్ ని ప్రతీ రోజూ రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా బాబు ఆరోగ్య పరిస్థితి ప్రజలకు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితానికి కచ్చితంగా 43 రోజులు పూర్తి అయిపోయాయి. చంద్రబాబు ఇన్నాళ్ళు జైలు గోడల మధ్యన ఉండడం అంటే నిజంగా ఆశ్చర్యమే అని భావించాలి. ఇక చంద్రబాబు ఫిట్ నెస్ కి ఎల్లపుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఏడున్నర పదుల వయసులో ఉన్న బాబుకు అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయనే అంటున్నారు.
కోర్టు ఆదేశాల మేరకు ఎప్పటికపుడు బాబు అరోగ్యం గురించి మీడియాకు జైలు అధికారులు తెలియచేస్తున్నారు. బాబుకు వైద్యులు అందిస్తున్న వైద్యంతో పాటు వారు ఇస్తున్న వివరాలతో హెల్త్ బులెటిన్స్ ని ప్రతీ రోజూ రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా బాబు ఆరోగ్య పరిస్థితి ప్రజలకు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 43వ రోజు అయిన శనివారం బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలియచేస్తూ హెల్త్ బులెటిన్ వెలువడింది. దాని ప్రకారం చూస్తే బ్లడ్ ప్రెషర్ 14-/80గా ఉంది. టెంపరేచర్ నార్మల్ గా ఉంది. పల్స్ రేట్ 71/మిన్ గా ఉంటే, రెస్పరేటరీ రేట్ 13/మిన్, గుండె ఎస్ 1+, ఎస్ 2+గా ఉంది. ఫిజికల్ యాక్టివిటీ గుడ్ అని రిపోర్ట్ లో పేర్కొన్నారు.
అయితే బాబు బరువు గురించి ఈ హెల్త్ రిపోర్ట్ లో పేర్కొనలేదు. రెండు రోజుల బట్టి బాబు బరువు విషయం హెల్త్ రిపోర్ట్ లో చెప్పడం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే జైలు అధికారులు బాబు జైలులోకి వచ్చేటప్పటికి 66 కిలోల బరువు ఉన్నారని, ఆయన ఇపుడు 67 కిలోలు ఉన్నారని, ఒక కిలో బరువు పెరిగారు అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి బాబు జైలులో బాగానే ఉన్నారని హెల్త్ రిపోర్ట్ బట్టి చూస్తే అర్ధం అవుతోంది. అయితే చంద్రబాబు జైలులో ఉన్నారన్నదే టీడీపీకి తమ్ముళ్ళకు దిగులుగా ఉంది. అదే వారి బెంగగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు హెల్త్ విషయంలో ఇబ్బందులు లేవన్నది ఏపీ ప్రజలకు ఈ రిపోర్టు ద్వారా అర్ధం అవుతోంది.