పుట్టి ముంచేస్తున్న త‌మ్ముళ్లు.. బాబును చూసి నేర్చుకోరా...!

తాజాగా ఆళ్ల గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రెచ్చిపోయారు. త‌న‌ద‌గ్గ‌ర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. 100 మంది పేర్లు ఉన్నాయ‌ని.. అంద‌రి అంతూ చూస్తాన‌ని గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-08 12:30 GMT

టీడీపీ ఎమ్మెల్యేలు త‌లోర‌కంగా మారిపోయారు. కొంద‌రిపై ఇసుక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బా బు వార్నింగ్ ఇచ్చారు. అంతో ఇంతో స‌ర్దుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలం చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌ను వెంట‌నే పార్టీ నుంచిస‌స్పెండ్ చేశారు. వివాదాలు వ‌ద్ద‌ని.. స‌మ‌స్య‌లు తీసుకురావ‌ద్ద‌ని చంద్ర‌బాబు గ‌ట్టిగానే సందేశం పంపించారు. అయినా.. త‌మ్ముళ్లు మార‌డం లేదు.

తాజాగా ఆళ్ల గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రెచ్చిపోయారు. త‌న‌ద‌గ్గ‌ర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. 100 మంది పేర్లు ఉన్నాయ‌ని.. అంద‌రి అంతూ చూస్తాన‌ని గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టికే నారా లోకేష్ రెడ్ బుక్‌తో ఇబ్బందులు రావ‌డంతో దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. చంద్ర‌బాబు తిప్పలు ప‌డుతున్నా రు. ఇంత‌లోనే భూమా ఇలా రోడ్డెక్కి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకునేందుకు పార్టీని బ‌జారున ప‌డేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అధికారంలోకి వ‌చ్చాను.. మీ అంతు చూస్తాను.. అని ఆమె చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అధికారం ఇచ్చింది.. అంతు చూసేందుకు కాదు. పైగా రాష్ట్రంలో ఒక ప‌క్క వ‌ర‌ద‌లు ఉన్న స‌మ‌యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు సాయం చేసేందుకు ముందుకు రావాలి. చంద్ర‌బాబుకు తోడు గా ఉండేందుకు ముందుకు వ‌చ్చి సాయం అందించాలి. ఇది వ‌దిలేసి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు.. త‌ల తోక లేని వ్యాఖ్య‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెడుతున్నారనే వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. వ‌ర‌దల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను సంయ‌మ‌నం పాటించేలా వ్య‌వ‌హ‌రించాల్సిన నాయ‌కులు.. సాయం చేయాల్సిన నాయ‌కులు.. ఇలా వ్యాఖ్యానించ‌డం.. రెచ్చిపోవ‌డం వంటివి పార్టీకి ఏమేర‌కు మేలు చేస్తాయో వారే ఆలోచించుకోవాలి. ఏదేమైనా.. త‌మ్ముళ్లు అయితే మార‌డం లేదు. చంద్ర‌బాబు ప‌డుతున్న క‌ష్టాన్ని కూడా వారు గుర్తించ‌డం లేదు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు