విశాఖ హార్బర్ దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్... సీసీ కెమెరాలో నాని?

ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి.

Update: 2023-11-25 06:13 GMT

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక లక్షల విలువ చేసే మత్స్య సంపద అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

ఈ అగ్నిప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే ఏపీ ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించింది. ఈ ప్రమాధంలో పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు.. 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000 చెల్లించగా.. పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించారు. ఈ క్రమంలో తాజాగా ఈ బోటు ప్రమాద ఘటనలో ఒక బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఇదొక పెను ప్రమాదంగా మిగిలిపోయిన హార్బర్ లో అగ్నిప్రమాదం ఘటనలో ఒక ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సీసీ ఫుటేజ్‌ సేకరించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని తెలుస్తుంది. ఆ ఫుటేజ్‌ లో ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు ప్రమాదం జరిగిన బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చారు.

19తేదీ రాత్రి 10:48కి బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటికి రాగా.. అదే రాత్రి 10:50కి ఆ బోటులో మంటలు చేలరేగాయి! దీంతో ప్రమాద ఘటనతో ఆ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారని తెలుస్తుంది.

మరోవైపు ఈ ప్రమాదానికి రెండు కారణాలను తెరపైకి వస్తునాయి. ఇందులో ఒకటి సిగరెట్ పీక కాగా.. మరొకటి ఎండు చేప! ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. ఈ నెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్‌ లో పార్టీ చేసుకుంటుండగా... మందులోకి మంచింగ్ కోసం అక్కడే ఉప్పు చేపను ఫ్రై చేశారు. ఆ చేపను తిన్న తర్వాత వారిలో ఒకరు సిగరెట్ వెలిగించారు.

అయితే చివర్లో చిన్న సిగరెట్ ముక్కను బోటు సమీపంలో పడేసి వెళ్లిపోయారు. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు.. ఇంత భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఇదే సమయంలో రెండో వాదన కూడా వినిపిస్తుంది! ఇందులో భాగంగా... ఉప్పు చేపను ఫ్రై చేసే క్రమంలోనే మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా... వీటిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది!

అయితే ఆ పార్టీలో ఉప్పు చేపను ఫ్రై చేసింది స్థానిక మత్స్యకారుడు వాసుపల్లి నాని అని చెబుతున్నారు. ఏది ఏమైనా... దీనికి సంబంధించి పోలీసుల వివరణ వస్తే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారని తెలుస్తుంది!

Full View
Tags:    

Similar News