బీజేపీలో కొత్త రచ్చ... దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెత్తనంపై నేతల నిప్పులు!
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సీరియస్ గా జరుగుతున్న వేళ పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు కూడా ఎంటరైపోయారని పలువురు బీజేపీ సీనియర్లు నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయారనే చర్చ గత రెండు మూడు రోజులుగా బలంగా వినిపిస్తుంది. ఇందులో భాగంగా ఒరిజినల్ గా బీజేపీతోనే రాజకీయం మొదలుపెట్టి.. దశాబ్ధాలుగా ఆ పార్టీలోనే కొనసాగుతూ.. సిద్ధాంతాల పరంగా ఫాలో అవుతూ ఉన్న పాతకాపులు ఒకరు కాగా... పక్క పార్టీల నుంచి వచ్చిన, పంపబడిన వలసపక్షులు మరొకరు. దీంతో... వలస పక్షులకు వారి వర్గం వారే వడ్డించే వారు అవ్వుతున్నారని, ఫలితంగా అసలు వారికి అన్యాయం జరుగుతుందని.. అసలుసిసలు బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారని తెలుస్తుంది.
అవును... పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వ్యవహారశైలి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ బీజేపీ సీనియర్ నేతలు ఫైరవుతున్నారు! ఏపీ బీజేపీ చీఫ్ గా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ.. ఆమె వ్యవహారశైలి బీజేపీ కోసం కాకుండా అన్నట్లుగా సాగుతుందని.. ఇందులో భాగంగా కమళదళంలో పసుపు రంగు పులిమేసే పని సీరియస్ గా చేస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సీరియస్ గా జరుగుతున్న వేళ పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు కూడా ఎంటరైపోయారని పలువురు బీజేపీ సీనియర్లు నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది. అసలు బీజేపీ అభ్యర్థుల ఎంపికతో ఆయనకు ఏమి సంబంధం అని నిలదీస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... టిక్కెట్ల ఎంపికలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు బీజేపీ క్యాడర్ లో తీవ్ర ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
ఉన్నవి 6 లోక్ సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు. ఏపీ బీజేపీలో అర్హులైన సీనియర్ నేతలు, అసలు సిసలు బీజేపీ నేతలు పుష్కలంగా ఉన్నప్పటికీ... అర్హులైన వారికి కాకుండా అద్దె బ్యాచ్ కు, గోడలు దాటిన వారికీ, సూట్ కేసులు తెస్తునన్వారికి టిక్కెట్లు కెటాయిస్తున్నారంటూ క్యాడర్ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు! ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న దారుణాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనునట్లు సమాచారం.
అసలు బీజేపీ టిక్కెట్ల కేటాయింపుకూ.. దగ్గుబాటి వెంకటేశ్వర రావుకూ ఏమిటి సంబంధం అనేది మాత్రం వారు మరింత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా పలువురి పేర్లు, ఇంత మొత్తం సొమ్ము చేతులు మారిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా... విజయవాడ బరిలో పీవీపీ, తిరుపతి ఆదికేశవుల కూతురుకు సీటు కేటాయించేందుకు వెంకటేశ్వర రావు చొరవ చూపుతున్నారని, దీని వెనుక భారీగానే డబ్బులు చేతులు మారి ఉంటాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇంతకాలం ఏపీలో బీజేపీ మనుగడ ప్రశ్నార్థకం కాకుండ కాపాడిన సీనియర్ నేతలైన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లతో పాటు విశాఖ ఎంపీ సీటు ఆశిస్తూ.. గత కొంతకాలంగా అక్కడే పనిచేస్తున్న జీవీఎల్ నరసింహారావు, కామినేని, హనుమతులు ఎక్కడ ఉన్నారని.. వారి పరిస్థితి ఏమిటని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన చర్య కాదని... ఇప్పటికే ఏపీ బీజేపీ అంటే టీడీపీకి బీ టీం గా మార్చేశారనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయని దుయ్యబడుతున్నారు.
ఏది ఏమైనా... ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ పురందేశ్వరి... టీడీపీ క్షేమం కోరుతూ పనిచేస్తున్నారని.. ఇందులో భాగంగానే.. బీజేపీ పార్టీకి ఎప్పటినుంచో సేవలందిస్తున్న వారిని కాకుండా... వెంకటేశ్వర రావు సిఫార్స్ చేసిన వారికి, కండువా మార్చి చంద్రబాబు పంపించిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని.. ఈ విషయంలో ఉపేక్షించేది లేదని.. ఢిల్లీ పెద్దలకు దృష్టికి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకెళ్తామని అంటున్నారని సమాచారం.