జగన్ బచ్చా.. బాబు కామెంట్స్ వైరల్ ..!
ఎన్నికల వేడి ఏపీలో బాగా పెరిగిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రజా గళం పేరుతో ప్రతీ రోజూ సభలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల వేడి ఏపీలో బాగా పెరిగిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రజా గళం పేరుతో ప్రతీ రోజూ సభలు నిర్వహిస్తున్నారు. ఆయన పాలకొల్లు సభలో అయితే వైసీపీ మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ని పట్టుకుని బచ్చా అన్నారు.
నన్ను గత నలభైఏళ్ళుగా ఏ ఒక్కరూ టచ్ చేయలేదు. నా జోలికి అసలు రాలేదు. అలాంటిది ఒక బచ్చా నా జోలికి వచ్చాడు ఇంతకు ఇంతా మూల్యం చెల్లిస్తాను అంటూ బాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రేపటి రోజున ఏపీలో టీడీపీ ప్రభుత్వం వస్తే జగన్ ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పడంతో పాటు బాబు జగన్ ని పట్టుకుని బచ్చా అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల సందర్భం కాబట్టి నేతలు ఎవరు ఏమి మాట్లాడినా అది వైరల్ అవుతుంది. ఇక సొంత పార్టీ వారిని కిక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రాజకీయ నేతలు కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. సెటైర్లు వేస్తూ ఉంటారు అయితే చంద్రబాబు లాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడుతూ బచ్చా అనడం ఏమంతా హుందాగా లేదని అంటున్న వారూ ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఈ విధంగా టార్గెట్ చేయడం వల్ల అది సోషల్ మీడియా టాపిక్ అవుతుంది అక్కడ జనాలు అట్రాక్ట్ అవుతారేమో తప్ప పార్టీకి టీడీపీ రాజకీయానికి ఏమంతా ఉపయోగం ఉండదనే అంటున్నారు.
అంతే కాదు మేము అధికారంలోకి వస్తే జగన్ ని వదలం అంటే రివెంజ్ పాలిటిక్స్ చేయడం కోసమా అధికారం అన్నది కూడా మేధావులలో జనాలలో చర్చకు వస్తోంది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. దాని కోసమే నేతలను ఎన్నుకునేది. ఏపీ చూస్తే పదేళ్ళుగా విభజన గాయాలతో కునారిల్లుతోంది
రివెంజ్ పాలిటిక్స్ కి జగన్ తెర తీశారనే మేధావి వర్గం తప్పుపడుతోంది. ఆయన చేస్తే నేనూ అలాగే అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కూడా అదే బాటలో నడుస్తామంటే ఏపీని కాపాడేది ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు జగన్ మీద విమర్శల జోరు పెంచారు.
అయితే ఏపీలో ఎన్నికల కోడ్ ఉంది. దానికి లోబడి ఎవరైనా విమర్శలు చేయాల్సి ఉంటుంది. పరుష పదజాలాలతో వ్యక్తిగత దూషణనల్తో విమర్శలు చేస్తే ఈసీ నోటీసులు ఇస్తుంది. సరైన సంజాయిషీ ఇవ్వకపోతే చర్యలకూ సిద్ధపడుతుంది. విమర్శలు తీవ్రంగా ఎవరూ చేసినా ఈసీ ఒకేలా వ్యవహరిస్తుంది కాబట్టి నేతలు అంతా మాటల అదుపు పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈసారి ఏపీ ఎన్నికలకు బోలెడు టైం ఉంది. అధికారం కోసం హోరా హోరీ సాగుతోంది. అందువల్ల అధినేతలు సహనంతో ఉండాల్సి ఉంటుంది. లేకపోతే క్యాడర్ కి సైతం తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.