విడాకుల పుకార్ల మధ్య చాహల్ నిగూఢమైన పోస్ట్ వైరల్!
ఈ సమయంలో చాహల్ - ధనశ్రీ విడాకులకు సంబంధించిన పుకార్లు కూడా హల్ చల్ చేస్తున్న వేళ ఓ ఆసక్తికర పోస్ట్ దర్శనమిచ్చింది.
సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిల్లు, బ్రేకప్ లు, విడాకులకు సంబంధించిన పుకార్లు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తుంటాయనే సంగతి తెలిసిందే. వీటీలో కొన్ని కాలక్రమంలో వాస్తవరూపం దాల్చగా.. మరికొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతుంటాయి. ఈ సమయంలో చాహల్ - ధనశ్రీ విడాకులకు సంబంధించిన పుకార్లు కూడా హల్ చల్ చేస్తున్న వేళ ఓ ఆసక్తికర పోస్ట్ దర్శనమిచ్చింది.
అవును... టీమిండియా క్రికెటర్ యుజేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ రకరకాల పుకార్లు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ నిగూఢమైన పొస్టు ను పంచుకున్నాడు చాహల్. దీంతో... అతని వ్యక్తిగత జీవితం గురించిన పుకార్లు మరోసారి మరింత ఆసక్తికరంగా షికార్లు చేస్తున్నాయని అంటున్నారు.
టీమిండియా క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ 2020 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక విలాసవంతంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఆ క్రమంలో... ఈ జంట తమ వివాహ బంధాన్ని ఆన్ లైన్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు! అనంతరం కొంత కాలానికి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని, విడివిడిగా ఉంటున్నారని గాసిప్స్ హల్ చల్ చేశాయి.
ఈ క్రమంలో... చాహల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి ధనశ్రీ తో ఉన్న ఫోటోలను తొలగించారు. దీంతో... విడాకుల పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యిందనే కామెంట్లు వినిపించాయి. అయితే... ధనశ్రీ మాత్రం చాహల్ తో ఉన్న ఫోటోలను ఇప్పటికీ తన ఇన్ స్టా అకౌంట్ లో ఉంచింది. దీంతో.. ఈ వ్యవహారం అభిమానుల మధ్య తీవ్ర సందిగ్ధతకు దారితీసిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ టీమిండియా క్రికెటర్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... "అన్ని శబ్ధాల కంటే ఎక్కువగా వినగలిగే వారికి.. నిశబ్ధం అనేది ఓ లోతైన శ్రావ్యత" అంటూ ఓ నిగూఢమైన కోట్ ను షేర్ చేశారు. దీంతో.. ఈ పోస్ట్ కు అర్ధం ఏమిటో అని కొంతమంది సందేహాలు వ్యక్తపరుస్తుంటే.. మరికొంతమంది ఆ కోట్ కు భావానువాదాలు చేస్తున్నారని అంటున్నారు.
మరి ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రచారానికి స్పష్టమైన ముగింపు త్వరలో తేలే అవకాశం ఉందా.. లేక, మరికొంతకాలం ఈ సందిగ్దత సాగక తప్పదా అనేది వేచి చూడాలి!