వద్దు జగన్... ఉండొద్దు జగన్ !

పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిన నేపధ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు పనిలో పనిగా వైసీపీ అధినేత మీద తీవ్ర విమర్శలే చేశారు.

Update: 2024-08-29 03:53 GMT

ఇది కొత్త స్లోగన్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుకున్న సరికొత్త స్లోగన్. జగన్ సీఎం గా వద్దు అని మొన్న అన్నారు. ప్రతిపక్ష నేతగా వద్దు అని ప్రజలు అన్నారని నిన్న చెప్పారు. నేడు జగన్ ఎమ్మెల్యేగా కూడా కనీసం పనికి రారు అంటున్నారు చంద్రబాబు. ఇంకాస్తా ముందుకు వెళ్ళి అసలు జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో లేకుండా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.

పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిన నేపధ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు పనిలో పనిగా వైసీపీ అధినేత మీద తీవ్ర విమర్శలే చేశారు. జగన్ వల్లనే పోలవరం పూర్తి కాలేదని నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళూ పోలవరం పడకేసింది అని ఆయన అన్నారు.

పోలవరాన్ని జగన్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, అందుకే 2021 నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ కాస్తా ఈ రోజుకీ ఏమీ కాకుండా ఉండిపోయింది అని అన్నారు. కేంద్రం పోలవరానికి ఎనిమిది వేల కోట్లు వైసీపీ హయాంలో ఇస్తే అందులో నాలుగు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టి నాసి రకం పనులు చేశారని మిగిలిన నాలుగు వేల కోట్లు ఇతర నిధులకు మళ్ళించుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

అంతే కాదు వైసీపీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కాఫర్ డ్యామ్ ని కూడా ఇబ్బంది పెట్టారని దాంతో గ్యాప్ 1 కొట్టుకుపోయేలా చేశారన్నారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ రానంత నష్టం జరిగిందన్నారు. దీంతో వైసీపీ సర్కార్ కట్టిన గైడ్ బండ్ కూడా కుంగి పోయిందన్నారు. ఇలా పోలవరానికి దారుణమైన నష్టం వైసీపీ ప్రభుత్వం ఏలుబడిలోనే వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.

అంతే కాదు అమరావతి రాజధానిలో ఎంత గబ్బు చేయాలో అంతా చేశారని ఫలితంగా ఆ గబ్బుని తీయడానికి ఏకంగా 35 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. జగన్ పాలన వల్లనే అధికారులు కూడా ఢిల్లీ వీధులలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

జగన్ అసలు రాజకీయ పార్టీని నడపడానికి కూడా అర్హుడు కాడని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బూతులు వినిపించేవని ఇపుడు ఎవరైనా ఎక్కడైనా వింటున్నారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్చ ఉందని అందరూ ప్రశాంతంగా ఉన్నారని అన్నారు.

ఇక పోలవరం విషయంలో వైఎస్సార్ హయాంలో కేవలం కాలువలే తవ్వాలని రోశయ్య ఏమీ చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి టెండర్లను పిలిచారని తాను వచ్చాకే అసలైన పనులు మొదలయ్యాయని ఏకంగా 72 శాతం పనులు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏసి 2019లో దిగిపోయామని చెప్పారు. ఇపుడు మళ్లీ తమ మీదనే పోలవరం బాధ్యత ఉందని అందుకే మూడేళ్ల కాల పరిమితిలో పూర్తి చేసేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News