బాబు మోదీ మోదం... మరీ అంత అల్ప సంతోషిగా..!

అలాంటి బాబుకు నరేంద్ర మోడీని చూడడం కలవడం ఎపుడూ ఎంతో మోదాన్ని కలిస్తున్నాయి. ఆయనే ఆ విషయం చెప్పుకుని సంబర పడుతున్నారు.

Update: 2024-09-17 04:55 GMT

చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్, నాలుగు సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వారు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా నరేంద్ర మోడీ కంటే కూడా సీనియర్. అలాంటి బాబుకు నరేంద్ర మోడీని చూడడం కలవడం ఎపుడూ ఎంతో మోదాన్ని కలిస్తున్నాయి. ఆయనే ఆ విషయం చెప్పుకుని సంబర పడుతున్నారు.

గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ చంద్రబాబు కలిశారు. బాబుని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వాంచి గౌరవించారు. ఈ సందర్భంగా మోడీ బాబు వేదిక మీద ముచ్చట కలిగించారు. అదే సమయంలో మోడీని గుజరాత్ లో కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని బాబు ట్వీట్ చేశారు. మోడీతో కలసి ఉండడం వేదిక పంచుకోవడం ఇవన్నీ బాబుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.

అయితే మోడీతో కలసి ఉండడమే ఆనందమా బాబు మరీ అంత అల్ప సంతోషిగా ఉన్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మోడీ ఏపీకి కేంద్ర బృందాన్ని పంపిస్తే చాలు బాబు ధన్యవాదాలు చెబుతున్నారు. ఏపీ గురించి ఫోన్ ద్వారా వాకబు చేస్తే చాలు అదే గొప్ప మేలుగా ఆయన భావిస్తున్నారు. మరి ఏపీ వరదలతో భారీ వానలతో అన్ని రకాలుగా నష్టపోయింది కేంద్రం ఇచ్చిన తక్షణ సాయం ఏమిటి అన్నది అందరి మాటగా ఉంది.

మోడీ పలకరించి మాట్లాడితేనే మోదమైతే ఎలా అని కూడా అంటున్నారు. ఏపీకి మోడీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి ఏపీని ఆదుకుంటే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల వరద నష్టం అని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్ర బృందం కూడా తన నివేదికను తయారు చేసింది. వీటి మీద కేంద్రం తక్షణం స్పందించి ఏమైనా సాయం చేస్తే మోడీ చేసిన సాయానికి ఏపీ ప్రజలు మొత్తం మొదంతో ఒప్పొంగిపోతారు కదా అని అంటున్నారు.

మరి మోడీ ఏమి సాయం చేశారని ఈ మోదం బాబు గారూ అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే గుజరాత్ వెళ్ళిన బాబు అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను సందర్శించారు.చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ గురించి ప్రధాని మోదీ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు దానిని సందర్శించి కాసేపు అక్కడ గడిపారు.

సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను కూడా చంద్రబాబు రాశారు. గాంధీజీని స్మరించుకుని ఆయన స్మృతికి నివాళులర్పించారు. దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తిండి పోతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఇలా గుజరాత్ లో బాబు పర్యటించి వచ్చారు మరి ఏపీకి వరద సాయం గురించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రధానితో చర్చించారా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం.


Tags:    

Similar News