మూడు నెలలలో జగన్ జాతకం అంటూ బాబు సంచలన కామెంట్స్...!

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి సారి ఏపీ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు

Update: 2023-12-08 09:56 GMT

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి సారి ఏపీ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. బాబు జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి దాదాపుగా మూడు నెలలు అయింది . ఈ మధ్యన తుపాను బాధితులను ఆదుకోవాలని కోరుతూ పాలసీ పరంగా కామెంట్స్ చేశారు.

అయితే ఇపుడు పూర్తి స్థాయిలో పొలిటికల్ కామెంట్స్ నే ఆయన చేసారు. తెలంగాణా ఎన్నికల ఫలితాల మీద బాబు ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. అంతే కాదు దానికీ జగన్ జాతకానికీ ముడిపెడుతూ బాబు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణాలో ఏమి జరిగిందో చూశారు కదా అంటూ ఆయన చెప్పుకురావడం విశేషం.

అహంకారంతో విర్రవీగితే ఏమి జరుగుతుంది అన్నది తెలంగాణా ఫలితాలు నిరూపించాయని బాబు అంటున్నారు. మరో మూడు నెలలలో ఏపీలో కూడా అలాంటి ఫలితాలనే చూస్తామని బాబు ధీమాగానే జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వం పూర్తి అహంకారంతో ఉందని ఆయన విమర్శించారు.

నన్ను అకారణంగా జైలులో పెట్టిన భయం జగన్ని ఇపుడు వెంటాడుతోంది అని చంద్రబాబు అన్నారు. నేను చేయని తప్పుకు జగన్ జైలులో పెట్టించారు అని చంద్రబాబు ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు. ఏపీకి కష్టాలు కేవలం మూడు నెలలు మాత్రమే అని చంద్రబాబు అన్నారు. అంటే కచ్చితంగా ఈసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తునారు.

ఏది ఏమైనా జగన్ మీద చంద్రబాబు విమర్శలు చేస్తూ ఇండైరెక్ట్ గా కేసీయార్ మీద కూడా చేశారని అంటున్నారు. అహంకారంతో విర్రవీగితే అలాగే జరుగుతుంది అన్న మాటలు కేసీయార్ కూడా తగిలాయని అంటున్నారు. కేసీయార్ విషయంలో ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గా కూడా చంద్రబాబు ఎపుడు గట్టిగా మాట్లాడింది లేదు. అలాంటిది ఆయన తెలంగాణా ఫలితాల మీద ఈ విధంగా మాట్లాడుతూ అటూ ఇంటూ ఇద్దరినీ విమర్శించారని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News