కాంగ్రెస్ తాజా జాబితా 57..తెలంగాణలో 5 ఎవరంటే?

మరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు రెండు జాబితాలను విడుదల చేసిన పార్టీ తన మూడో జాబితాలో మొత్తం 57 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది.

Update: 2024-03-22 04:33 GMT

మరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు రెండు జాబితాలను విడుదల చేసిన పార్టీ తన మూడో జాబితాలో మొత్తం 57 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఐదుగురు అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్ననియోజకవర్గాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల ప్రకటనతో ఉత్కంట వీడిందని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో ప్రకటించిన ఐదుగురు తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..

1. చేవెళ్ల రంజిత్ రెడ్డి

2. పెద్దపల్లి గడ్డం వంశీ

3. మల్కాజ్ గిరి సునీత మహేందర్ రెడ్డి

4. నాగర్ కర్నూల్ మల్లు రవి

5. సికింద్రాబాద్ దానం నాగేందర్

మొత్తం పదిహేడు స్థానాలు ఉన్న తెలంగాణలో తాజాగా ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులతో కలిపితే మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిల్లో ఖమ్మం.. అదిలాబాద్.. వరంగల్.. భువనగిరి.. కరీంనగర్.. మెదక్.. నిజామాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి కాకుండా హైదరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

తాజాగా ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ కు చెందిన వారున్నారు. రంజిత్ రెడ్డి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కాగా.. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ మారిన ఆయనకు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఒకవేళఈఎన్నికల్లో దానం నాగేందర్ కు ఓటమి ఎదురైతే.. ఆయనకు మంత్రి పదవి వరించే వీలుంది. సునీతమహేందర్ రెడ్డి సైతం ఇటీవల గులాబీ కారుకు గుడ్ బై చెప్పేసి హస్తం గూటికి చేరటం తెలిసిందే.

Tags:    

Similar News