అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం ఖాయం అంటున్న టైమ్స్ ఆఫ్ ఇండియా
అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల నేపధ్యం నుంచి చూసుకున్నపుడు మరోసారి కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కూడా ధీమాగా చెబుతోంది.
దేశంలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా గట్టిగా చెబుతోంది. ఈ మేరకు తన దగ్గర ఉన్న అంచనాలను బయటపెడుతోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను ఓట్లను గెలుచుకుంది అని గుర్తు చేస్తోంది.
అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల నేపధ్యం నుంచి చూసుకున్నపుడు మరోసారి కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కూడా ధీమాగా చెబుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తెస్ ఘడ్ లలో మొత్తం అసెంబ్లీ సీట్లు 520 ఉన్నాయని, ఇందులో నుంచి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 282 సీట్లను గెలుచుకుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది.
అలా గెలుపు శాతం తీసుకుంటే 54.2 ఉందని అంటోని. దక్షిణాదిన ఉన్న తెలంగాణాతో పాటు మిజోరామ్ కలుపుకుని మొత్తం చూస్తే 683 సీట్లు అవుతాయి. ఇందులో 2018లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు 305గా ఉన్నాయి. బీజేపీ ఇందులో 199 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అంటే ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చాలానే ఉంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది.
ఇపుడు పరిస్థితి ఈ అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ కి బాగా మారింది అని అంటోంది. గతానికి కంటే మంచి పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చేయనుంది అని అంటోంది. అందువల్ల కచ్చితంగా ఈ అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన అంచనాను బయటకు తెచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా అంచనా మేరకు ఈ అయిదు రాష్ట్రాలలో బీజేపీ గట్టిగా పోరాడాల్సి ఉంటోంది అని అంటున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు ఇప్పటికే చెప్పేసాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరా హోరీ పోరు సాగించనుంది. చత్తీస్ ఘడ్ లో బీజేపీకి మళ్లీ ఓటమి తప్పదని తేలుతోంది.
తెలంగాణాలో చూస్తే బీయారెస్ కాంగ్రెస్ ల మధ్యనే పోరు సాగుతోంది. బీజేపీ అక్కడ మూడవ ప్లేస్ కే పరిమితం కానుంది. మిజోరాం లో కాంగ్రెస్ కి బలం ఉంది, ప్రాంతీయ పార్టీ మిజో నేషన్ల్ ఫ్రంట్ తో పోటీ పడుతోంది. ఈ దఫా ఓటర్లు కాంగ్రెస్ కి పట్టం కట్టవచ్చు అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. అలా చూసుకుంటే ఈ అయిదు రాష్ట్రాలలో హస్తవాసి బాగానే ఉంటుంది అని అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మేము గెలిచి తీరుతాం చూడండి అని ఆయన అంటున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. అవి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్నాయని అంటున్నారు.