తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న సీ ప్యాక్ సర్వే

అయితే అనూహ్యంగా తాజాగా సీ ప్యాక్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో నిలవడం గమనార్హం.

Update: 2024-04-17 08:53 GMT

తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని లోక్ సభ స్థానాల్లో గెలవబోతుంది ? ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం మినహాయిస్తే మిగిలిన 16 స్థానాల్లో బీజేపీ ఆరు, కాంగ్రెస్ ఎనిమిది, బీఆర్ఎస్ ఒకటి లేదా 2 అని పలు సర్వేలు వెల్లడించాయి. అసలు తెలంగాణలో బీఅర్ఎస్ ఉనికే లేదని కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నాయి.

అయితే అనూహ్యంగా తాజాగా సీ ప్యాక్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణలో 34.54 శాతం ఓట్లతో బీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు, 27.17 శాతం ఓట్లతో బీజేపీ 2 స్థానాలు, 30.03 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు, 2.18 శాతం ఓట్లతో ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని వెల్లడించింది.

గత శాసనసభ ఎన్నికల్లో ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 40, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సీపీఐ 1 స్థానంలో గెలుస్తాయి అని వెల్లడించడం విశేషం.దానికి అనుగుణంగానే కాంగ్రెస్ 64, సీపీఐ 1, బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి.

గత శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మినహా ఏ హామీ అమలుకాలేదు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పాలనలో కాంగ్రెస్ వైపల్యాల మీద ప్రజలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ సభలు వెల వెల బోతుండగా, బీఆర్ఎస్ సభలు విజయవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీ ప్యాక్ సర్వే ఉత్కంఠ రేపుతుంది.

Tags:    

Similar News