ఎన్నికల వేళ పెరోల్ పై రేపిస్ట్ బాబా?... తెరపైకి కొత్త చర్చ!!

ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో హర్యానాలోని డేరా సచ్ఛా సౌధా ఆశ్రమం అధిపతిగా ఉన్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-29 12:30 GMT

ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో హర్యానాలోని డేరా సచ్ఛా సౌధా ఆశ్రమం అధిపతిగా ఉన్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా వివిధ కారణాలతో ఆయనకు ఇప్పటికే పదిసార్లు పెరోల్ లభించిందని అంటున్నారు. దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి.

అయితే తాజాగా పదకొండోసారి కూడా తనకు పెరోల్ కావాలని ఆయన దరఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్యానా ఎన్నికల వేళ ఇతడి పెరోల్ రిక్వస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అవును... అక్టోబరు 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డేరా సచ్ఛా సౌధా ఆశ్రమం అధిపతిగా ఉన్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్ కు అభ్యర్థించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తన శిష్యులు, అనుచర బృందం ఇతరాత్రా మార్గాల్లోకి వెళ్లిపోకుండా ఇలా రామ్ రహీమ్ పెరోల్ పై పదె పదే బయటకు వస్తున్నారని అంటున్నారు.

అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు రావడంపై మాత్రం ఈసారి బలమైన చర్చ జరుగుతుంది. ఇతడు ఇప్పటికే 10సార్లు పెరోల్ పై వచ్చిన సందర్భాలు గమనిస్తె అవన్నీ ఎన్నికలు.. లేదా, రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా 10 సార్లు పెరోల్ పై బయటకు వచ్చిన 10 సార్లు కలిపితే ఇతడు సుమారు 8 నెలల పాటు బయటే ఉన్నాడని అంటున్నారు.

అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వస్తుండటంతో వాటిని ప్రభావితం చేసేందుకే ఇలా బయటకు వస్తున్నాడా అనే చర్చ నెలకొంది. కాగా... హర్యానాలో బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న వేళ గుర్మిత్ పెరోల్ లో బయటకు రానున్నారనే విషయం ఏమేరకు ప్రభావం చూపిస్తుండో అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News