ధోనీ గ్యారేజ్... ఇచ్చట అన్నిరకాల వాహనాలు ఉండును!

ఆ సందర్భంగా ధోనీ గ్యారేజ్ ని చూసిన వెంకటేశ్ ప్రసాద్ షాకయ్యాడని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఒక వీడియోని విడుదల చేశారు ప్రసాద్‌.

Update: 2023-07-19 04:38 GMT

ప్రపంచం లో భోజన ప్రియులు ఎలా ఉంటారో.. వాహన ప్రియులు కూడా అలానే ఉంటారని అంటుంటారు. అయితే రెగ్యులర్ గా మోడల్స్ మార్చడం.. లేదా, ఒకటి కంటే ఎక్కువగా రెండు మూడు రకాల బైక్స్ ని కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే ఈ వాహన ప్రియులందు ధోనీ ప్రియత్వం పీక్స్ అని అంటుంటారు.

అవును... మైదానం లో తన మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటు వేసే ధోనీ... తనదైన హెలీకాఫ్టర్ షాట్స్ తో బంతిని బౌండరీ అవతల కి మెరుపు వేగం తో కొట్టే ధోనీ... మైదానం బయట మాత్రం మెరుపు వేగం తో దూసుకుపోయే బైక్స్ / కార్స్ అంటే ప్రాణమిస్తాడని అంటుంటారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా రాంచీకి వెళ్లిన వెంకటేశ్‌ ప్రసాద్‌... ధోనీ ని కలిశాడని తెలుసుంది. ఈ సందర్భంగా... ధోనీ కలెక్ట్ చేసిన వాహనాల ను చూసేందుకు రాంచీ ఫామ్‌ హౌజ్‌ కు వెళ్లారంట. ఆ సందర్భంగా ధోనీ గ్యారేజ్ ని చూసిన వెంకటేశ్ ప్రసాద్ షాకయ్యాడని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఒక వీడియోని విడుదల చేశారు ప్రసాద్‌.

ఈ సందర్భంగా స్పందించిన ప్రసాద్... "బైక్‌ లంటే ఇంత మక్కువ, ఇంత పిచ్చి కలిగిన వ్యక్తుల్లో ధోనీ ఒకరు. ఇది ఎంతో గొప్ప కలెక్షన్‌. ధోని గొప్ప సాధకుడు, అద్భుతమైన వ్యక్తి. ఇది రాంచి లోని నివాసం లో బైక్స్‌, కార్ల కలెక్షన్ల గ్లింప్స్‌" అంటూ ఆ వీడియోను పంచుకున్నాడు. మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషీ కూడా ఇందులో కనిపించాడు. ఈ వీడియో లో ధోనీ, అతడి భార్య సాక్షితో జరిపిన సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా.. ఇన్ని బైక్‌ ల అవసరమేంటి? అని ధోనీ ని అతని భార్య సాక్షి అడిగినట్లు ఆ వీడియోలో వినిపిస్తుంది. దీని పై స్పందించిన ధోనీ... "ఎందుకంటే నువ్వు నాకు సంబంధించినవన్నీ తీసుకున్నావు. నాకంటూ సొంతంగా ఓ ప్రదేశం ఉండాలి కదా. అయినా.. నువ్వు అనుమతించింది ఇదొక్కటి మాత్రమే..!" అని అన్నాడు.

అయితే ధోనీ కలెక్షన్స్ లో ఎన్ని బైకులు ఉన్నాయో నెంబర్ తెలియదు కానీ... అక్కడ లేని బైక్ లేదు అన్నా అతిశయోక్తి కాదేమో అనేలా ఉంది ఆ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Tags:    

Similar News