కర్ణాటకలో కిస్సా కుర్సీ కా.. డీకే వర్సెస్ సిద్ధు

రాష్ట్రంలో బీజేపీ అధికారం కోసం కాసుకు కూర్చుని ఉంది అనే ఆలోచన కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంటే ఇట్లే ఉంటాయి అన్నట్లుగా కన్నడ నాట రగడ మొదలైంది.

Update: 2024-12-06 15:30 GMT

పొరుగునున్న మహారాష్ట్రలో ఘోరంగా పరాజయంపాలై 2 వారాలు కూడా కాలేదు.. అక్కడి ఫలితాలను చూసి బుద్ధి కూడా తెచ్చుకోలేదు.. దేశంలోనూ పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు అనే సోయి లేదు.. రాష్ట్రంలో బీజేపీ అధికారం కోసం కాసుకు కూర్చుని ఉంది అనే ఆలోచన కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంటే ఇట్లే ఉంటాయి అన్నట్లుగా కన్నడ నాట రగడ మొదలైంది.

డీకేను కాదని సిద్ధును వరించి

కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద పెద్ద నాయకులున్నారు. అంతెందుకు? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక వారే. ఇక సిద్ధరామయ్య ఇప్పటికే ఓ సారి కాంగ్రెస్ సీఎంగా చేసి ఉన్నారు. ‘అహింద’ నినాదంతో సిద్ధు కాంగ్రెస్ పార్టీని బడుగు, బలహీన వర్గాల చెంతకు చేర్చారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పార్టీకి అనధికారికి కోశాధికారి అనుకోవచ్చు. పైగా కన్నడ నాట ప్రస్తుతం ఈయనకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందింది. మరి.. సీఎంగా సిద్ధునా? డీకే నా? అనే ప్రశ్నలు వచ్చాయి. అధిష్ఠానం సర్దిచెప్పి ముందు రెండున్నరేళ్లు సిద్ధుకు పదవి ఇచ్చింది. వచ్చే ఏడాది (2025) నవంబరుతో ఇది ముగియనుంది.

కుర్చీ కోసం అంతర్గత పోరు

‘‘జీవితాంతం డిప్యూటీ సీఎంగా ఉండను. మా మధ్య ఓ అవగాహన ఉంది. అదిప్పుడు చెప్పనంటూ’’ ఓ చానల్ ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం ఇప్పుడు కన్నడ నాట దుమారం రేపుతోంది. దీనిని సీఎం సిద్దరామయ్య ఖండించారు. మరోవైపు అలాంటి ఒప్పందాలుంటే ఇక పార్టీలో మేమెందుకంటూ హోం మంత్రి, ఓ దశలో సీఎం రేసులో ఉన్న పరమేశ్వర వ్యాఖ్యానించు.

దీంతో కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డీకే మధ్య ఆధిపత్య పోరు తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News