పవన్ పెళ్లిళ్లపై దువ్వాడ... తనవరకూ వచ్చాక తెలిసింది!!
అవును... పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఏ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది. ఈ సమయంలో... గతంలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో ఆ వ్యాఖ్యలపై తాజాగా దువ్వాడ స్పందించారు.
అవును... పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. నాడు ఆయన ఈ వ్యవహారంపై మాట్లాడుతూ... అసలు ఒక్కడు ముగ్గురిని చేసుకోవడం ఏమిటి.. ఒక్కో మగాడు తలచుకుంటే వెయ్యి మందిని చేసుకోవచ్చు.. కానీ అది పద్దతి కాదు, తెలుగువాడు ఏకపత్నీ వ్రతుడిగా ఉండాలి.. ఒకే స్త్రీతో సంసారం మన సాంప్రదాయం వంటి మాటలు చెప్పారు.
అయితే... ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య, కుమార్తెలు చేసున్న ఆరోపణలు.. దీనిపై స్పందిస్తూ మాధురి అనే మహిళ ఇచ్చిన వివరణలు వెరసి ఇప్పుడు ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారిన పరిస్థితి. దువ్వాడ కొంతకాలంగా మొదటి భార్య, పిల్లలను విడిచిపెట్టి మాధురి అనే మహిళతో ఉంటున్నాడని.. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం చేస్తున్నాడంటూ ఆయన భార్య, కుమార్తె రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో నాడు పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలపై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారనేది ఆయన మాటల్లోనే చూస్తే... "రెండో వివాహం, మూడో వివాహం చట్టరీత్యా నేరం. అయితే.. నేను రెండో వివాహం చేసుకోలేదు. నేను నేరం చేయలేదు. పవన్ కల్యాణ్ విషయంలో ఆరోజు మాట్లాడింది అది!" అని అన్నారు.
ఇదే క్రమంలో... "నేను రెండో వివాహం చేసుకోలేదు.. చేసుకుని ఉంటే ఆ మాట నేను తప్పినవాడిని అయ్యి ఉండేవాడిని.. పవన్ కల్యాణ్ విషయంలో ఆలోచిస్తే ఆయనకు ఏ పరిస్థితులు ఎలా దారితీశాయో..? ఇప్పుడు నాదగ్గరకు వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమవుతోంది.. సమస్య నా వరకూ వస్తే నాకు అర్ధమైంది.. అందువల్ల ఆయనకు ఏ పరిస్థితులు ఎటు దారితీశాయో మనం ఎలా చెప్పగలుగుతాం" అని స్పందించారు దువ్వాడ!
ఇదే సమయంలో... "పవన్ కల్యాణ్ రెండో వివాహానికి, మూడో వివాహానికి దారి తీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి ఉండబట్టే ఆయన ఆ పనిచేశాడనేది నాకున్న పరిస్థితినిబట్టి నాకు ఇప్పుడు అర్ధమైంది" అని దువ్వాడ క్లారిటీ ఇచ్చారు. దీంతో... తనవరకూ వచ్చేటప్పటికి దువ్వాడకు తత్వం బోధపడినట్లుందనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.