భారీగా ఉద్యోగులను తొలగించిన మస్క్!.. ఆ విభాగానికి షాక్!
కారణాలు ఏవైనా.. గత కొంతకాలంగా టాప్ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాలకు కోతలు విధిస్తున్నాయని అంటున్నారు.
కారణాలు ఏవైనా.. గత కొంతకాలంగా టాప్ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాలకు కోతలు విధిస్తున్నాయని అంటున్నారు. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అని ఒకరంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అని మరొకరు అంటున్నారు. కారణం ఏదైనా, కంపెనీ మరేదైనా.. ఉద్యోగులను తొలగించడం మాత్రం కామన్ గా మారిందని అంటున్నారు నిపుణులు!
అవును... ఇటీవల కాలంలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల సంఖ్య భారీగా పెరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని "ఎక్స్" (ట్విట్టర్) నుంచి కూడా భారిగా ఉద్యోగాల కోత విధించబడిందని కథనాలొస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్ లో భారీ కోతలంటూ పలు నివేదికలు తెరపైకి వస్తున్నాయి.
ఇలా ఎక్స్ నుంచి తొలగించబడిన ఉద్యోగులు ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో ఉన్నారని అంటున్నారు. అధికారిక లెక్కలు ఇంకా బయటకు రానప్పటికీ.. కథనాలు మాత్రం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే... ఇలా వినిపిస్తున్న కథనాలపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.
కాగా... మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సమయంలో సుమారు 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఈ ఏడాది జనవరిలోనూ ఎక్స్ నుంచి సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేధించబడింది. వీరిలో మెజారిటీ ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అనే చర్చా నడించింది.
ఇక ప్రస్తుతం ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. నవంబర్ 5న జరగనున్న అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తరుపున మస్క్ ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా చాలా సహాకారం అందిస్తున్నారని అంటున్నారు.