దావూద్ మీద వస్తున్న వార్తల్లో నిజమెంత? పాక్ లో ఏం జరుగుతోంది?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఏమీ కాలేదా? ఆయనపై విష ప్రయోగం జరిగిందని.. ఆయన కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కొందరు.

Update: 2023-12-19 04:02 GMT

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఏమీ కాలేదా? ఆయనపై విష ప్రయోగం జరిగిందని.. ఆయన కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కొందరు.. కాదు అత్యంత సీరియస్ గా అతడి ఆరోగ్య ఉందని మరికొందరు.. ఇదేమీ కాదు అతను చనిపోయాడు కూడా అంటూ ఇంకొందరు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. దావూద్ మీద వచ్చిన వార్తలు మొత్తం ఫేక్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. పాక్ కు చెందిన ఒక యూట్యూబర్ క్రియేట్ చేసిన ఈ గందరగోళానికి అందరూ కనెక్టు అయిపోయినట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దావూద్ వార్తల నేపథ్యంలో పాక్ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇందులోనూ నిజం లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు.. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిర్వహించిన వర్చువల్ ర్యాలీ కారణంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్ డాగ్ నెట్ బ్లాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ లో ఏడు గంటల పాటు సోషల్ మీడియాలో పరిమితులు విధించిన విషయాన్ని వెల్లడించింది.

ఈ పరిమితులన్ని దావూద్ మీద వచ్చిన వార్తల నేపథ్యంలో అని చెప్పినా.. అసలు లక్ష్యం మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్లకుండా చేయటమేనని చెబుతున్నారు. గతంలోనూ ఇలానే జరిగినట్లుగా తెలుస్తోంది.పాకిస్థాన్ లో దావూద్ తల దాచుకుంటున్న విషయం ఇప్పటికే బయటకు వచ్చినప్పటికి దాయాది దేశం కానీ.. అంతర్జాతీయ సంస్థలు సైతం పెద్దగా పట్టుకున్నది లేదు. తాను టార్గెట్ చేసిన ఆల్ ఖైదా ఉగ్రవాదుల్ని వెంటాడి మరీ.. దేశం ఏదైనా కానీ దూసుకెళ్లి మరీ లేపేసే అలవాటున్న అమెరికన్ సైన్యం సైతం దావూద్ అంశంపై పెద్దగా ఫోకస్ చేసినట్లుగా కనిపించదు. మొత్తంగా దావూద్ మీద విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఏ నిఘా వర్గాలు సైతం వెల్లడించలేదు. దీంతో.. ఇవన్నీ ఉత్త పుకార్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News