టీమిండియా మాజీ క్రికెటర్ పై అరెస్ట్ వారెంట్... కేసు ఏమిటంటే..?

అవును... టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని అంటున్నారు.

Update: 2024-12-21 12:17 GMT

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం ఆరోపణల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు పీ.ఎఫ్. నిధులు చెల్లించలేదని అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అవును... టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని అంటున్నారు. డిసెంబర్ 27లోగా అతడు బకాయిలు చెల్లించాలని.. దేదంటే అరెస్టు తప్పదని వారెంట్ లో పేర్కొనడం గమనార్హం. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాబిన్ ఊతప్ప డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్ నుంచి పీఎఫ్ ను కట్ చేశాడు. కానీ... వాటిని ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ లో జమ చేయలేదు. వీటి మొత్తం రూ.23 లక్షలు ఉంటుందని అంటున్నారు.

ఇలా మొత్తం సుమారు రూ.23 లక్షలను తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని తేలిందని చెబుతూ పీఎఫ్ రీజనల్ కమిషనర్.. ఉతప్పకు నోటీసులు జారీ చేశారు. దీంతో.. వాటిని అందజేసేందుకు డిసెంబర్ 4న పులకేశినగర్ లోని మాజీ క్రికెటర్ నివాసానికి వెళ్లారు కానీ.. అతడు అక్కడ లేడు.

దీంతో.. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ ఆదేశించినట్లు జాతీయ మీడియాలో కథనాలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో... డిసెంబర్ 27 లోపు ఊతప్ప స్పందించి బకాయిలు చెల్లిస్తారా.. లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News