ఇది చదివాక గుండె బరువెక్కుతుంది.. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి

1977 - 1982 వరకు నెదర్లాండ్స్ ప్రధానిగా వాన్ ఆగ్ట్ వ్యవహరించారు.

Update: 2024-02-15 06:02 GMT

ఆయన ఒక దేశ మాజీ ప్రధానమంత్రి. ఆయన.. ఆయన సతీమణి కొద్ది రోజుల క్రితం మరణించిన వైనం తొలుత ఆ దేశాన్ని.. కాస్త ఆలస్యంగా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతోంది. వీరి విషాద ఉదంతం గురించి తెలిసిన తర్వాత అప్రయత్నంగా కంట కన్నీరు ఖాయమని చెప్పాలి. వయసు మీద పడటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది. తిరిగే కాలు తిరుగుతున్నంతనే కాలం చేస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. అందుకు భిన్నంగా కొన్ని ఉదంతాలు ఉంటాయి. ఇంతకూ ఆ మాజీ ప్రధాని ఎవరు? ఆయన ఉదంతం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ ఆగ్ట్.. ఆయన సతీమణి యూజీనీ ఇద్దరు ఒకేసారి మరణించారు. 93 ఏళ్ల వయసున్న ఆయన.. ఆయన సతీమణి ఇద్దరు అక్కడి చట్టంలో అనుమతించిన రీతిలో కారుణ్య మరణాన్ని కోరుకున్నారు. చివరి క్షణాల్లో ఒకరి చేతిలో ఒకరి చేతిని పట్టుకొని.. ఒకరినొకరు చూసుకుంటూ ఫిబ్రవరి 5న కన్నుమూశారు. దీంతో వీరి 70 ఏళ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. వీరి జీవితం గతంగా మారింది.

1977 - 1982 వరకు నెదర్లాండ్స్ ప్రధానిగా వాన్ ఆగ్ట్ వ్యవహరించారు. ఆయన 93వ పుట్టిన రోజును జరుపుకున్న తర్వాత ఆయన తన సొంతూరు నిజ్ మెగెన్ లో తన ప్రియాతి ప్రియమైన భార్యతో కలిసి కారుణ్య మరణం చెందారు. 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారిన మాజీ ప్రధాని ఆ తర్వాత కోలుకోలేకపోయారు. మాజీ ప్రధాని.. ఆయన సతీమణి ఇద్దరు అస్వస్థతకు గురి కావటంతో వారు నడవటం కూడా కష్టంగా మారింది.

అదే సమయంలో ఒకరిని విడిచి మరొకరం ఉండలేమన్న విషయాన్ని గుర్తించిన వారు.. కలిసి జీవించే కన్నాకలిసి మరణించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు. 2002లో నెదర్లాండ్స్ లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశారు. 2022 ఒక్క ఏడాదిలో కారుణ్య మరణానికి 8720 మంది దరఖాస్తు చేసుకోవటం గమనార్హం. అనారోగ్య పరిస్థితుల్లో బతకటం ఇబ్బందికరంగా మారటంతో తమ దేశ ప్రధాని.. ఆయన సతీమణి కారుణ్య మరణాన్నిఎంచుకొని.. మరణ వేళలో.. ఇద్దరు ఒకరి చేయిని మరొకరుపట్టుకొని.. ఇద్దరు చూసుకుంటూ భూమి నుంచి శాశ్వితంగా సెలవు తీసుకున్నారు.

Tags:    

Similar News