అవంతికే భీమిలీ...అటు నుంచి గంటా రెడీ...?

అయితే వైవీ సుబ్బారెడ్డి కోరినంత సులువుగా భీమిలీ వైసీపీ పరిస్థితులు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది

Update: 2023-08-25 03:49 GMT

మాజీ మంత్రి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకే భీమిలీ టికెట్ ని ఖాయం చేసేశారు. ఈ శుభవార్తను వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా భీమిలీలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. గతసారి కంటే మంచి మెజారిటీతో అవంతిని గెలిపించాలని పార్టీ శ్రేణులను సుబ్బారెడ్డి కోరారు.

అయితే వైవీ సుబ్బారెడ్డి కోరినంత సులువుగా భీమిలీ వైసీపీ పరిస్థితులు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది. భీమిలీ ఎమ్మెల్యే  మీద ఇంటా బయటా వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఆయన పనితీరు బాగా లేదని సొంతంగా పార్టీ చేసిన సర్వేలు కూడా చెప్పాయని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మాజీ మంత్రి స్థాయి క్యాండిడేట్ అయితే వైసీపీకి భీమిలీలో లేరు అని అంటున్నారు.

పైగా భీమిలీలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. అదే సామాజికవర్గానికి చెందిన నేత అయిన అవంతినే మల్లీ గెలుపు గుర్రం అవుతారని బరిలోకి దించుతున్నారు. అవంతి 2009, 2019లో రెండు సార్లు భీమిలీ నుంచి గెలిచారు. 2024లో కూడా ఆయనకే జనాలు పట్టం కడతారని వైసీపీ ఊహిస్తోంది.

ఒక దశలో అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించి వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అయిన విజయనిర్మలను పోటీ చేయించాలని అనుకున్నారు. ఆమె భీమిలీ మునిసిపాలిటీగా ఉన్నపుడు వైఎస్ చైర్మన్ గా పనిచేశారు. బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన విజయ నిర్మలను దింపితే బీసీ ఓట్లు పూర్తిగా టర్న్ అవుతాయని ఆశించారు.

అయితే అవతల వైపు నుంచి బలమైన అభ్యర్ధిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమునిపట్నంలో పోటీకి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. గంటాను ఢీ కొట్టాలంటే అవంతి బెటర్ అని ఆయనకే పార్టీ మొగ్గు చూపింది అని అంటున్నారు. అయితే జగన్ వేవ్ బలంగా వీస్తున్న నేపధ్యంలోనే కేవలం పదివేల ఓట్ల తేడాతో అవంతి గెలిచారు.

అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యే పనితీరు పట్ల అసంతృప్తి ఎటూ ఉంటుంది. జనసేనకు కూడా భీమిలీలో బలం కొంత ఉంది. ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని కలిస్తే అవంతి కి ఇబ్బందే అని అంటున్నా ఆయనేఅ అభ్యర్ధి అనడం వెనక వైసీపీ ధీమా ఏంటి అంటే పొత్తులు ఉన్నా ఓట్లు షిఫ్ట్ కావని, అదే టైం లో తమ ప్రభుత్వ సంక్షేమ పధకాలే మళ్లీ గెలిపిస్తాయని. మొత్తానికి ఇటు అవంతి రెడీ అయ్యారు. అవతల వైపు గంటా అంటున్నరు. ఈ ఇద్దరు శ్రీనులు పోటీకి దిగితే భీమిలీలో రసవత్తరమైన పొలిటికల్ సీన్ క్రియేట్ అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News