బతుకుజీవుడా.. గాజా.. 17 నెలల యుద్ధం.. 50 వేల మరణాలు..

2023 అక్టోబరు 7.. సరిగ్గా ఇప్పటికి 17 నెలలు.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై.. ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన హమాస్ మిలిటెంట్లు 1200 మందిని చంపేశారు.;

Update: 2025-03-24 03:42 GMT

2023 అక్టోబరు 7.. సరిగ్గా ఇప్పటికి 17 నెలలు.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై.. ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన హమాస్ మిలిటెంట్లు 1200 మందిని చంపేశారు. 250 మంది ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్ స్థావరమైన గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం మొదలుపెట్టింది.

20 లక్షల జనాభా ఉన్న గాజా ఇప్పుడొక చెల్లాచెదురైన ప్రదేశం. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 50 వేల మంది పాలస్తీనీయన్లు చనిపోయారని తాజాగా గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 1.13 లక్షల మంది గాయపడ్డారని ప్రకటించింది. ఈ లెక్కన గాజాలో 2.5 మంది జనాభా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారని తెలుస్తోంది.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం గాజాలో హమాస్ ఆధీనంలో ఉన్న 100 మంది ఇజ్రాయెలీలు, ఇతర దేశాల వారిని అప్పగించాలి. కానీ, ఈ విషయంలో హమాస్ మాట తప్పింది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

చర్చల వ్యవధి ముగిసిన వారం వ్యవధిలోనే ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగింది. గత 2, 3 రోజుల్లోనే 673 మంది చనిపోయారు. వీరిలో పౌరులు, యుద్ధంలో పాల్గొన్నవారు ఎందరు అనేది చెప్పలేదు.

హమాస్ 50 మంది ప్రజలను కోల్పోయినట్లు చెబుతుండగా.. ఇజ్రాయెల్‌ మాత్రం దాదాపు 20వేల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పేర్కొంటోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కాల్పుల ధాటికి గాజా ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలుసార్లు అటు ఇటు తిరిగిన వీరు ఏ ప్రదేశం సురక్షితమో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇజ్రాయెల్‌.. తాజాగా దక్షిణ గాజాపై భీకరంగా దాడి చేసింది. శనివారం రాత్రి 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

గాజాలో నాలుగు ప్రాంతాలు.. ఖాన్ యూనస్, రఫా, దక్షిణ, ఉత్తర గాజా. వీటిలో రఫా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. ఇక్కడినుంచి పాలస్తీనియన్లు బతుకుజీవుడా అంటూ వెళ్లిపోతున్నారు.

Tags:    

Similar News