గీతాంజలి ఆత్మహత్యపై ఆమె భర్త, కూతురు రియాక్షన్ ఇదే!

తాజాగా గీతాంజలి ఆత్మహత్య చేసుకుని మరణించిన అంశంపై స్పందించిన ఆమె భర్త... పట్టాలు తీసుకుంది, మాట్లాడింది, ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.

Update: 2024-03-12 09:53 GMT

ప్రస్తుతం ఏపీలో గీతాంజలి ఆత్మహత్య ఘటన ప్రకంపనలు లేపుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను సృష్టించినవారిపై చీత్కారాలు మొదలయ్యాయి! ఇంతటి సంస్కార హీనులను వదిలిపెట్టకూడదంటూ నెట్టింట గీతాంజలికి మద్దతుగా ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేయాలని అంటున్నారు. ఈ సమయంలో గీతాంజలి భర్త కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఈ నెల 4వ తేదీన ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఇంటి పట్టాను తీసుకున్న గీతాంజలి... ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని, సంతృప్తిని వెల్లడించింది. ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వంలో తమకు అమ్మఒడితో పాటు ఇంటిపట్టా కూడా వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలో ఆమె ట్రోలింగ్ కి గురైందని తెలుస్తుంది! అయితే ఆ విషయం తనకు చెప్పలేదని అంటున్నారు ఆమె భర్త.

తాజాగా గీతాంజలి ఆత్మహత్య చేసుకుని మరణించిన అంశంపై స్పందించిన ఆమె భర్త... పట్టాలు తీసుకుంది, మాట్లాడింది, ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. దానికి గుడ్ కామెంట్స్ వస్తాయి.. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అయితే ఆమె మాత్రం గుడ్ కామెంట్స్ గురించి మాత్రమే తమకు చెప్పిందని.. బ్యాడ్ కామెంట్స్ గురించి చెప్పలేదని తెలిపాడు. అయితే ఆమె గుడ్ కామెంట్స్ వచ్చిన ఆనందంలోనే ఉంది అని తాము అనుకుంటున్నామని అన్నాడు.

అయితే... రెండు మూడు సార్లు తెల్లవారుజాము సమయంలో 3 గంటల ప్రాంతంలో ఫోన్స్ మాట్లాడటం.. ఏడూస్తూ ఒకసారి కనబడటం జరిగిందని తెలిపాడు. ఆమె ఇంత ఆవేదన్లో ఉన్నట్లు తనకు చెప్పలేదని తెలిపాడు. అనంతరం ఇదే విషయాలపై గీతాంజలి కుమార్తె మాట్లాడింది. ఇందులో భాగంగా ఇలాంటి ఘటన జరిగిందనే విషయం తమకు తెలియదని తెలిపింది. రెండు మూడు రోజులుగా తన తల్లి సరిగా మాట్లాడటం లేదని.. పిలిచినా కూడా మాట్లాడలేదని చెప్పింది.

ప్రస్తుతం గీతాంజలి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లిలేని బిడ్డలుగా మారిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. ఇందులో భాగంగా... తనకు వచ్చిన ఇంటిపట్టాని మీడియాకు చూపించి మాట్లాడటమే ఆమె చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఐటీడీపీ, జనసేనలు ఆమెను ఎంతో వల్గర్ గా వేదించారని.. ఈ ఘటన దురదృష్టకరమని తెలిపారు.

మరోపక్క సోషల్ మీడియా కామెంట్ల వల్లే ఆమె మనస్థాపానికి గురైనట్లు పోలీసులు గుర్తించారని.. పంచనామాలో కూడా ఈ విషయాలను పొందుపరిచారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఆమెను టార్గెట్ చేసినట్లు చెబుతున్న సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారని సమాచారం.

Full View
Tags:    

Similar News