"ఏ దేశమేగినా ఎందు కాలెడినా.. ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము" అని రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఫంక్తులు చదువుకుని గుర్తుపెట్టున్నారో ఏమో కానీ... ఆస్ట్రేలియాలో ఉంటున్నా, ఆస్ట్రేలియా క్రికెటర్ ని పెళ్లి చేసుకున్నా.. భారతీయ మూలాలు మరిచిపోలేదు మాక్స్ వెల్ భార్య!
అవును... ప్రాశ్చత్య మోజులో పడి భారతీయ పద్దతులను పద్ధతులను విడనాడుతున్న జనం విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆటగాడు వినీ రామన్ భార్య తన సాంప్రదాయ సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారుతున్నాయి.
భారతదేశ దక్షిణాది మూలాలున్న వినీ రామన్ భారత సాంప్రదాయంలో ఈ సీమంతం చేసుకోవాలనుకున్నా.. అందుకు అంగీకరించిన మాక్స్ వెల్ ని ఈ సందర్భంగా భారతీయులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా దంపతులిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు... పుట్టబోయే బేబీకి హాయ్ చెబుతున్నారు.
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ భార్య గర్భం దాల్చింది. వినీ రామన్ కు ఈ మధ్య ఏడు నెలలు నిండాయి. దీంతో మ్యాక్స్ వెల్ తన భార్యకు దక్షిణ భారతదేశంలో నిర్వహించే సాంప్రదాయ సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించాడు.
అచ్చమైన చీరకట్టు, బొట్టులో వినీ రామన్ ను అచ్చమైన భారతీయ మహిళగా ముస్తాబు చేసి ఈ వేడుకను నిర్వహించారు. ఈ సీమంతం ఫోటోలను ఇన్ స్టా గ్రాం వేదికగా పంచుకున్న వినీ రామన్.. "బేబీ మ్యాక్స్ వెల్ కు మా సాంప్రదాయ పద్ధతిలో ఆశీర్వాదం" అని క్యాప్షన్ జోడించింది.
కాగా... విని రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ తో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే అది ప్రేమకు దారి తీసింది. గత ఏడాది మార్చిలో వీరి వివాహం ముందుగా తమిళ సంప్రదాయంలో జరిగింది. అనంతరం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళ సంప్రదాయం ప్రకారం వినికి సీమంతం చేయించాడు గ్లెన్.
ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాక్స్ వెల్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళురు (ఆర్.సి.బి)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పదహారో సీజన్ లో అతను విధ్వంసక ఇన్నింగ్స్ లతో ఫ్యాన్స్ ను అలరించాడు. 11 మ్యాచుల్లో 186.44 స్ట్రైక్ రేటుతో 330 రన్స్ కొట్టాడు. వీటిలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.