ఒక్క ప‌ని.. ఆ ఎంపీకి డోర్లు క్లోజ్ చేసేసింది...!

రాజ‌కీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో.. ఎలాంటి అడుగులు వేయ‌కూడదో.. ఆ నేత‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది

Update: 2024-01-14 01:30 GMT

రాజ‌కీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో.. ఎలాంటి అడుగులు వేయ‌కూడదో.. ఆ నేత‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నేనేం చేసినా.. అంతా చెల్లుంద‌ని ఆయ‌న అనుకుని ఉండొచ్చు. కానీ, ప్ర‌జ‌లు అలా భావించే అవ‌కాశం లేదు. ఇక‌, ప్ర‌జ‌ల నాడి ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్న పార్టీ కూడా.. అలానే అడుగులు వేస్తుండ‌వ‌చ్చు. ఫ‌లితంగా స‌ద‌రు నేత కెరీర్‌.. నిలిచిపోయే ప్ర‌మాద‌మే కనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

స‌ద‌రు నేతే.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌. ఇప్పుడు ఆయ‌న‌కు ఎటు చూసినా దారులు మూసుకు పోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎంపీ సీటు ఎలానూ ఇచ్చే ప‌రిస్థితి లేకుండాపోయి.. ఏకంగా.. పొరుగు రాష్ట్రానికి చెందిన జోల‌ద‌రాశి శాంత‌ను తెచ్చి.. పార్టీ టికెట్ ఇచ్చేసింది. ఇక‌, ఇది పోతే పోయింది.. క‌నీసం ఎమ్మెల్యే సీటు అయినా.. ఇవ్వ‌క‌పోతారా? అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే..ఇ క్క‌డ కూడా ఆ అవ‌కాశం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా.. మాధ‌వ్‌ను త‌ట్టుకునే కేడ‌ర్ కానీ.. ఆయ‌న కోసం జెండాలు మోసే వారు కూడా లేర‌నే అంచ‌నాల నేప‌థ్యంలోనూ.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న చేసిన 'పాడు ప‌ని' క‌ళ్ల ముందు క‌ద‌లాడుతు న్న నేప‌థ్యంలోనూ వైసీపీ వ్యూహాత్మ‌కంగా దారులు మూసేసింది. ఆ నాడు సీఎం జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని గ‌గ్గోలు పెట్టిన వారే.. ఇప్పుడు నివ్వెర పోతున్నారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో జ‌గ‌న్‌కు బాగానే తెలుసున‌ని గుస‌గుస‌లాడుతున్నారు.

ఇక‌, ఇప్పుడు ఎంపీపాయే, ఎమ్మెల్యే సీటు కూడా పాయే.. తాడేప‌ల్లిలోనే మ‌కాం వేసినా.. క‌నీసం పార్టీ నుంచి పిలుపు రాక‌పాయే.. మ‌రి ఇప్పుడు మాధ‌వ్ ప‌య‌నం ఎటు? అంటే.. నేరుగా ఇంటికేన‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. నోరున్న నాయ‌కుడిని ఎవ‌రైనా భ‌రిస్తారు.. డ‌బ్బులేని నాయ‌కుడిని కూడా భ‌రిస్తారు. కేడ‌ర్ లేకున్నా నెట్టుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కానీ, వెకిలి చేష్ట‌లు.. విప‌రీత పోక‌డ‌లు పోయే నాయ‌కుడిని ఎవ‌రూ భరించ‌లేరు.

Tags:    

Similar News