హంగేరీ లో మహిళలకు బంపర్ ఆఫర్.. ఆ ఒక్క పని చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది..
మ్యాన్ పవర్ బాగా క్షమించడంతో ఈ దేశాలు వలసల పై ఆధార పడాల్సిన పరిస్థితిని ఎదురవుతున్నాయి.
ప్రపంచంలో జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభా ఎన్నో దేశాలను కలవర పెడుతున్న సమస్యగా మారుతుంది. అయితే కొన్ని దేశాలు గణనీయంగా తగ్గుతున్న జనాభాతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నానాటికి వీరికి జనాభా లెక్కలు పడిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఆర్థిక వసతులు సరిగ్గా లేకపోవడం, వృత్తిపరమైన సవాళ్లు ఎక్కువ కావడంతో ఆ దేశాలలో యువత పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
దీని ప్రభావం భవిష్యత్తు తరాలపై తీవ్రంగా పడుతోంది. మ్యాన్ పవర్ బాగా క్షమించడంతో ఈ దేశాలు వలసల పై ఆధార పడాల్సిన పరిస్థితిని ఎదురవుతున్నాయి. నానాటికి క్షీణిస్తున్న జనాభాను తిరిగి గాడిలో పడవేయడానికి ఈ దేశాలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఐరోపా దేశం హంగేరీ (Hungary) తమ దేశ జనాభాని పెంచడానికి సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగానే ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ.. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయంపై కూడా స్పష్టత ఇచ్చారు.
“ఐరోపాలో జనాభా సంఖ్య రోజురోజుకి పల్చబడిపోతుంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలలో ఎక్కువగా వలసల మీద ఆధారపడాల్సి వస్తోంది. జనాభా సంఖ్యను పెంచడం కోసం వలసదారులను ఆహ్వానించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అందుకే ఒక విభిన్నమైన ఆలోచనతో కనీసం నలుగురు లేక అంతకంటే ఎక్కువమంది సంతానాన్ని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగతంగా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నాం.”అని హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వెల్లడించారు.
అంతేకాదు ఈ దేశంలో పెద్ద కుటుంబాలు ఉన్నవారు పెద్ద పెద్ద కార్లు కొనడానికి సబ్సిడీలు కూడా ఇవ్వబోతున్నట్టు హంగేరీ ప్రభుత్వం ప్రకటించింది. పిల్లలను పెంచడం కోసం దేశవ్యాప్తంగా 21 వేలకు పైగా క్రెచ్లను ప్రారంభించబోతున్నట్లు తెలియపరిచింది. ఇటువంటి మినహాయింపులు ఇచ్చి యువతకు పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచి దేశ జనాభా పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా హంగేరీ ప్రభుత్వం ఆ దేశాలకు ఇలాంటి బంపర్ ఆఫర్లు ఎన్నో ప్రకటించింది. పెళ్లిళ్లు, బర్త్ డే పెంచడం కోసం 2019లో ఒక వినూత్నమైన స్కీంని హంగేరీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 41 సంవత్సరాల కంటే ముందుగానే పెళ్లి చేసుకుని అమ్మాయిలకు 10 మిలియన్ల ఫోరింట్స్ సబ్సిడీ రుణాలు కల్పించింది. ఒకవేళ పెళ్లి తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లయితే ఆమె తీసుకున్న రుణంలో మూడవ వంతును ప్రభుత్వం మాఫీ కూడా చేస్తుంది అని తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగినట్లయితే ఆ మహిళ తీసుకున్న పూర్తి రుణం మాఫీ చేయబడుతుంది అనే బంపర్ ఆఫర్ ని కూడా అందించారు.