ఇండియాలో బెస్ట్ నగరాలు ఇవేనా?
ప్రపంచంలో ఎన్నో నగరాలున్నాయి. అందులో మంచి నగరాలుంటాయి. దుర్భరమైనవి కూడా ఉంటాయి.
ప్రపంచంలో ఎన్నో నగరాలున్నాయి. అందులో మంచి నగరాలుంటాయి. దుర్భరమైనవి కూడా ఉంటాయి. మెర్సర్ అనే సంస్థ విడుదల చేసిన 241 మంచి నగరాల్లో మన దేశంలోని ఏడు నగరాలు ఉండటం గమనార్హం. రాజకీయ స్థిరత్వం, విద్య, ఆరోగ్యం, సామాజిక, మౌలిక సదుపాయాలు వంటి ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. మన దేశంలోని ఏడు నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
హైదరాబాద్ 153, పుణే 154, బెంగుళూరు 156, చెన్నై 161, ముంబై 164, కోల్ కత 170, ఢిల్లీ 172 స్థానాల్లో నిలిచాయి. ఇందులో మన హైదరాబాద్ ముందువరసలో నిలవడం విశేషం. భాగ్యనగరానికి వచ్చిన పాయింట్లు 153. అన్నింటికంటే ఢిల్లీకి వెనుకబడి ఉంది. మనదేశంలోని ఏడు నగరాలు బెస్ట్ సిటీస్ గా నిలవడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోని 241 నగరాలను మంచి నగరాలుగా సెలెక్ట్ చేసింది. అందులో మన దేశంలోని నగరాలు ఉండటం వల్ల మన వారి జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుందని తెలుస్తోంది. బెస్ట్ క్వాలిటీ లివింగ్ సిటీస్ గా ర్యాంకులు ప్రకటించడంతో మన నగరాలు కూడా అందులో భాగం కావడం వల్ల మన నాగరికత కూడా మెరుగైన స్థితిలోనే ఉందని తెలుస్తోంది.
మనదేశంలోని నగరాల్లో కూడా మంచి స్థితిగతులు చోటుచేసుకుంటున్నాయి. వారి జీవన ప్రమాణంలో మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మెరుగైన స్థాయిలు దక్కుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే మంచి నగరాలుగా ఖ్యాతి ఆర్జిస్తున్నాయి. మెర్సర్ విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు మన ఏడు నగరాలు చోటు దక్కించుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్ లో కూడా మన నగరాలు ఇంకా మంచి స్థానం సంపాదించుకుంటాయి. హైదరాబాద్ 153 పాయింట్లతో మన దేశంలోని అన్ని నగరాల కంటే మెరుగైన ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంకా పలు రంగాల్లో మెరుగైన స్థితి దక్కించుకుని మంచి నగరంగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.