ఈ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వరంతే....?
వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వలేమని జగన్ తాజాగా జరిగిన గడప గడపకు రివ్యూ మీటింగులో తెగేసి చెప్పారు.
వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వలేమని జగన్ తాజాగా జరిగిన గడప గడపకు రివ్యూ మీటింగులో తెగేసి చెప్పారు. టికెట్లు ఇవ్వనంతమాత్రాన వారు తన మనుషులు కాకపోరని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వారంతా తన వారే అని ఆయన అంటున్నారు. వారికి న్యాయం చేస్తామని అన్నారు.
అలాగే వారికి వేరే ఇతర పదవులు ఇచ్చి పార్టీ గౌరవిస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే జగన్ మదిలో ఏ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, ఎవరికి టికెట్లు దక్కవు అన్నది కనుక చూస్తే ప్రచారంలోనూ ఊహాగానాలలోనూ ఉన్న పేర్లు చాలానే ఉన్నారు.
కనీసంగా ఇరవై మందికి పై చిలుకు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు దక్కవని తెలుస్తోంది. అలా ప్రచారంలో ఉన్న ఆ జాబితాను చూసుకుంటే ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే పాతపట్నం నుంచి రెడ్డి శాంతికి టికెట్ దక్కదని అంటున్నారు. ఆముదాలవలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం కి టికెట్ దక్కదని అంటున్నారు.
అలాగే ఎచ్చెర్ల నుంచి గొర్లె కిరణ్ కుమార్ కి ఈసారి నో టికెట్ అని జగన్ చెబుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రాజాం లో కంబాల జోగులుకి టికెట్ రాదు అని అంటున్నారు. బొబ్బిలిలో శంబంగి చిన అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఎస్ కోటలో కడుబండి శ్రీనివాసరావుకి ఎస్ కోటలో కడుబండి శ్రీనివాసరావు.
అదే విధంగా గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి, ఎలమంచిలిలో కన్నబాబురాజు, నర్శీపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి ఎస్ కోటలో కడుబండి శ్రీనివాసరావు . అలాగే పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావుకి టికెట్ లేదు అని చెబుతున్నారు.
అమలాపురం నుంచిమంత్రి పినిపె విశ్వరూప్ నుంచి టికెట్ ఇవ్వరని అంటున్నారు. గన్నవరం కొండేటి చిట్టిబాబుకు కూడా లేదు అంటున్నారు. మచిలీపట్నం లో పేర్ని నానికి తప్పించి పేర్ని కిట్టుకు టికెట్ ఇస్తారు. మంగళగిరిలో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, గుంటూర్ ఈస్ట్ ముస్తాఫా కు టికెట్ లేదని తెలుస్తోంది.
గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాదరావుకు కూడా టికెట్ లేదు అంటున్నారు. నందికొట్కూర్ ఎమ్మెల్యే తోగూర్ ఆర్డర్, సత్యవేడు కోనేటి ఆదిమూలంలకు టికెట్లు రావు. అదే విధంగా ఇద్దరు మంత్రులు విడదల రజనీ, సత్తెనపల్లి లో అంబటి రాంబాబులకు టికెట్లు దక్కవని మరో వైపు ప్రచారం సాగుతోంది.
ఏది ఏమైనా ఈసారి మాత్రం జగన్ ముందే చెప్పినట్లుగా గెలుపు కోసం తీసుకోవాల్సిన కఠిన చర్యలలో భాగంగా టికెట్లు ఇవ్వరని అంటున్నారు. మొత్తానికి చూస్తే టికెట్లు దక్కని వారి ప్లేస్ లో కొత్త వారిని ఎవరిని దింపుతారు అన్నది చర్చగా ఉంది.