నిన్న పుతిన్, నేడు జెలెన్ స్కీ... మోడీ హగ్ లపై జైశంకర్ క్లారిటీ!
ఇప్పుడు మోడీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముందు ఇదే విషయాన్ని ప్రస్థావించింది అంతర్జాతీయ మీడియా.
ప్రస్తుతం మోడీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సుమారు 30 ఏళ్ల క్రితం భారత్ – ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ దేశంలో కాలు మోపిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డ్ సృష్టించారు. అంతక ముందు రష్యాలోనూ పర్యటించారు ప్రధాని. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకోవడంపై పలు పాశ్చాత్య దేశల నుంచి గతంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటలో ఉన్న మోడీ.. జెలెన్ స్కీని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వస్తున్న విమర్శలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ మేరకు జై శంకర్ ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాకు క్లారిటీ స్ట్రాంగ్ గా ఇచ్చారు!
అవును... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకొవడంపై పలు పాశ్చాత్య దేశాల నుంచి గతంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోడీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముందు ఇదే విషయాన్ని ప్రస్థావించింది అంతర్జాతీయ మీడియా. ఈ నేపథ్యంలో ఘాటుగా స్పందించారు జైశంకర్.
ఇందులో భాగంగా... మోడీ - పుతిన్ మధ్య స్నేహాన్ని పాశ్చాత్య దేశాలు సరిగా అర్ధం చేసుకోలేవని.. దానికి కారణం సంస్కృతిలో అంతరమే అని పేర్కొంటూ చురకలంటించారు. భారత్ లో ఒకరినొకరు కలిసేటప్పుడు ఆలింగనం చేసుకోవడం సహజమని.. ప్రజా సంబంధాల్లో ఇదొక భాగమని.. ఇది భారతీయ సంస్కృతిని మరింత ఇనుమడింపజేస్తుందని జై శంకర్ స్పష్టం చేశారు.
ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న మోడీ.. జెలెన్ స్కీ ని కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని చెబుతూ.. ఇది మీ మీ సంస్కృతిలో భాగం కాకపోవచ్చు అంటూ.. మన మధ్య సాంస్కృతిక అంతరం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇలా పుతిన్ - మోడీ ఆలింగనంపై ప్రశ్నించిన పాశ్చాత్య మీడియా ప్రతినిధికి జైశంకర్ చురకలంటిస్తూ అన్నట్లుగా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఇదే సమయంలో... ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న మోడీ.. ప్రధానంగా మాస్కో – కీవ్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపైనే జెలెన్ స్కీతో చర్చించారని తెలిపారు. అదేవిధంగా... ఉక్రెయిన్ లో భారత ప్రధాని పర్యటన చారిత్రాత్మకమని.. నాలుగు ప్రధాన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఇదే క్రమంలో... జెలెన్ స్కీ ని భారత్ పర్యటనకు రావాలని మోడీ ఆహ్వానించారు.