తన మానసిక స్థితిపై జో బైడెన్ ఆసక్తికర ప్రకటన!

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో డిబేట్ లో పాల్గొన్నప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది.

Update: 2024-07-12 13:38 GMT

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక స్థితిపై తెగ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో డిబేట్ లో పాల్గొన్నప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. పైగా ఇటీవల కాలంలో కమలా హ్యారిస్ అనాల్సింది పోయి ట్రంప్ అనడం.. జెలెన్ స్కీ అనాల్సింది పోయి అధ్యక్షుడు పుతిన్ అనడం వంటి సందర్భాలతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఈ సమయంలో బైడెన్ స్పందించారు.

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక స్థితిపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తడబాట్లు, పొరపాట్లు ఈ చర్చకు కారణాలు అవుతున్నాయి. ఈ సమయంలో తన మనసిక స్థితిపై బైడెన్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవడానికి అవసరమైతే వైద్య పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారు.

అవును... తాజాగా నాటో సదస్సు ముగిసిన సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ ఫరెన్స్ లో జో బైడెన్ స్పందించారు. ఇందులో భాగంగా... మరోసారి న్యూరాలజీ టెస్టులు చేయించుకోవాలని తన వైద్యులు సూచిస్తే.. వారి సూచనలను వ్యతిరేకించనని.. తప్పనిసరిగా పాటిస్తానని బైడెన్ వెల్లడించారు. ఇదే సమయంలో... తన చుట్టూ చాలా ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... తాను చాలా ఫిట్ గానే ఉన్నట్లు వెల్లడించిన బైడెన్... తాను ఏమి చేసినా, ఎవరూ సంతృప్తి చెందడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇప్పటికే మూడుసార్లు న్యూరోలాజికల్ పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడోది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చేసినట్లు వివరించారు. తాను రోజూ తీసుకుంటున్న నిర్ణయాలే తన మానసిక పరిస్థితిని తెలియజేస్తున్నాయని అన్నారు.

అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే... తన మానసిక స్థితి బాగానే ఉందని చెప్పిన ఆయన తాజా ప్రెస్ మీట్ లో కూడా తడబడటం గమనార్హం. ఇందులో భాగంగా... "మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలగితే... ట్రంపు ను కమలా హ్యారీసి ఓడించగలరని భావిస్తున్నారా"? అని ప్రశ్నించగా... "అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్ కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు" అని అన్నారు.

అంటే... పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా కమలా హ్యారిస్ అనబోయి ట్రంప్ అనేశారన్న మాట. ఇదే సమయంలో... ఈ సమావేశానికి ముందు నాటో కూటమికి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పరిచయం చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీని ఆహ్వానిస్తూ... "అధ్యక్షుడు పుతిన్" అని సంభోధించారు. అంటే... జెలెన్ స్కీ బదులుగా పుతిన్ అని అన్నారన్నమాట.

దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కవ్వగా... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానస్థితిపై చర్చ మరింత పుంజుకుంది.

Tags:    

Similar News