బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ..?

జనసేన వర్గాల కు ప్రత్యేకించి పవన్ వీరాభిమానుల కు ఇది ఆనందం కలిగించే వార్త.

Update: 2023-07-26 15:50 GMT

జనసేన వర్గాల కు ప్రత్యేకించి పవన్ వీరాభిమానుల కు ఇది ఆనందం కలిగించే వార్త. అయితే ఇది ప్రచారంలో ఉన్న విషయం తప్పించి నిర్ధారణ అయితే కాదు. కానీ బీజేపీ ఎత్తులు వ్యూహాలు చూస్తూంటే ఏపీ లో ఆశ్చర్యకరమైన ప్రకటనలే చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఏపీ లో బీజేపీ జనసేన తో పొత్తు పెట్టుకుంది. మూడున్నరేళ్ళుగా ఈ పొత్తు కొనసాగుతోంది. అయితే ఈ పొత్తుల వల్ల పవన్ కళ్యాణ్ బీజేపీ కలసి పనిచేశారా అంటే పెద్దగా లేదు అన్న మాట వస్తుంది. అయితే ఎన్నికలు దగ్గర పడడంతో ఇపుడు పవన్ని బీజేపీ పెద్దలు బాగా చేరదీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మీట్ కి ఏపీ నుంచి తమ ఏకైక మిత్రునిగా పవన్ని ఆహ్వానించారు.

అలా పవన్ తో బంధం బలం గా బిగుసుకుంటున్న వేళ జనసేనాని కూడా ఢిల్లీ నుంచి తిరిగి వస్తూనే ఎన్డీయే సర్కార్ ఏపీలో ఏర్పాటు అవుతుంది అని ప్రకటించారు. ఇక ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. ఆమె జనసేన తో పొత్తులు నిన్నా ఇవాళే కాదు రేపు కూడా ఉంటాయని బలంగా నొక్కి చెప్పారు.

ఈ నేపధ్యంలో మీడియా అడిగిన అనేక ప్రశ్నల కు పురంధేశ్వరి నుంచి ఆసక్తి కరమైన జవాబులే వచ్చాయి. ఏపీ లో జనసేన బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తారా ప్రకటిస్తే ఎవరు అని అడిగినపుడు ఆమె అంతా ఢిల్లీ లోని కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది అని బదులివ్వడం విశేషం. అంతే కాదు ఏపీ లో కొత్త పార్టీలతో పొత్తులు అంటే టీడీపీ లాంటివి అన్న మాట. ఆ విషయం కూడా కేంద్ర నాయకత్వమే చూసుకుంటుంది అని ఆమె చెప్పడం గమనార్హం.

ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఆమె టీడీపీ తో పొత్తులు ఉండవని గట్టిగా కొట్టిపారేయలేదు. అలాగే ఉంటాయని కూడా చెప్పలేదు. కేంద్ర నాయకత్వం మీదనే ఆ విషయాన్ని పెట్టేశారు. తాను కేంద్ర నాయకత్వం సూచనల మేరకు పని చేస్తానని, ఏపీ లో బీజేపీని అభివృద్ధి చేస్తానని ఆమె అంటున్నారు. ఇక తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగానా లేక అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగానా ఎక్కడ పోటీ చేస్తాను అన్న విషయాలు కూడా బీజేపీ హై కమాండ్ చూసుకుంటుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

ఇవన్నీ ఇలా ఉంటే సేన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని జాతీయ నాయకత్వమే ప్రకటిస్తుందని ఆమె చెప్పడం మీద ఇపుడు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అలా కనుక ప్రకటిస్తే ఎవరు ఉంటారు అన్నది చర్చకు వస్తోంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ణే ముందు పెట్టి బీజేపీ ఏపీ లో రాజకీయ వ్యూహాలు రూపొందిస్తుందని అంటున్నారు. సీఎం గా పవన్ కళ్యాణ్ణి ప్రకటించడం ద్వారా తమతో ఆయనను ఉంచుకోవాల ని కూడా ఆలోచన చేస్తుంది అని అంటున్నారు.

అదే విధంగా రేపటి రోజున టీడీపీ తో పొత్తు కుదిరినా ముందర కాళ్ళకు బంధం వేసేలా అధికారం లో వాటా ను కోరేలా పవన్ని సీఎం క్యాండిడేట్ గా బీజేపీ రెడీ చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం చేస్తున్న ఈ ప్రయత్నం టీడీపీ కి ఏ విధంగా ఉంటుందో ఆ పార్టీ రేపటి రోజున పొత్తుల విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తుందో కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News