కమలా హారిస్ వర్సెస్ ట్రంప్... ఆసక్తికరంగా కొత్త పోల్స్ ఫలితాలు!

అవును... తాజాగా వెలువడిన పోల్స్ ప్రకారం ప్రధానమైన స్వింగ్ రాష్ట్రాల్లో కమలా హారిస్ కు డొనాల్డ్ ట్రంప్ దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది.

Update: 2024-10-01 15:46 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైన సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఆసక్తికర పోరు నడిచింది. అయితే... డిబేట్స్ లో బైడెన్ తడబడుతున్నారనే చర్చ తెరపైకి రావడంతో ఆయన స్థానంలో కమలా హారిస్ రంగంలోకి దిగారు. దీంతో అప్పటినుంచి పోరు రసవత్తరంగా మారింది.

మొదట్లో వినిపించిన అంచనాల్లో ట్రంప్ కు అనుకూలత ఉందని.. బైడెన్ కాస్త వెనుకబడ్డారని హల్ చల్ చేసేవి! అయితే... కమలా హారిస్ ఎంట్రీ తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థికి అనుకూల ఫలితాలు అనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో తాజాగా వెలువడుతున్న పోల్స్ ఈ ఫైట్ మరింత రసవత్తరంగా మారినట్లు చెబుతున్నాయి.

అవును... తాజాగా వెలువడిన పోల్స్ ప్రకారం ప్రధానమైన స్వింగ్ రాష్ట్రాల్లో కమలా హారిస్ కు డొనాల్డ్ ట్రంప్ దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది. వీరిద్ధరిమధ్యా స్వల్ప తేడానే కనిపిస్తుందని.. ఈ సారి పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉండే అవకాశం ఉందని.. చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు వార్ వన్ సైడ్ కాదని తాజా అంచనాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా... విస్కాన్సిన్ లో కమలా హారిస్ 49 శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ 47 శాతంతో ఉన్నారు. ఇక మిచిగాన్ లో కమలా హారిస్ 48 శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 47 శాతం ఓట్లతో ఫైట్ ను రసవత్తరంగా నడుపుతున్నారు! నార్త్ కరోలినా విషయానికొస్తే ఇక్కడ టైకి దారితీసే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల రేసులో స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారని ది ఎకనామిస్ట్ ప్రెసిడెంట్ అంచనా వేసింది. దీని ప్రకారం... ఎలక్టోరల్ కాలేజీలో హారిస్ 281 ఓట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే.. ఇది గెలవడానికి అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ.

ఇదే సమయంలో... ట్రంప్ 257 మంది ఓటర్లను గెలుచుకోవచ్చని చెబుతుంది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థికి 270 ఎలక్టోరల్ సభ్యుల మద్దతు అవసరం కాగా... ట్రంప్ 13 స్వల్ప ఓట్లు మాత్రమే వెనకబడి ఉన్నారు! ఇక తాజా జాతీయ పోలింగ్ సగటులో హారిస్ 49.9 శాతం.. ట్రంప్ 46.2 శాతంతో ఉన్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News