కామారెడ్డి టెన్షన్ పెరిగిపోతోందా ?

కేసీయార్లో కామారెడ్డిలో గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ? అంతిమ ఫలితం ఎలాగ ఉండబోతోందో తెలీదు కానీ ఇప్పటికైతే కేసీయార్ లో టెన్షన్ స్పష్టంగా తెలుస్తోంది.

Update: 2023-11-06 04:44 GMT

కేసీయార్లో కామారెడ్డిలో గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ? అంతిమ ఫలితం ఎలాగ ఉండబోతోందో తెలీదు కానీ ఇప్పటికైతే కేసీయార్ లో టెన్షన్ స్పష్టంగా తెలుస్తోంది. ఎలాగంటే నియోజకవర్గంలోని సామాజికవర్గాల సంఘాలతో మంత్రులను భేటీలు చేయమని ఆదేశించారు. కులసంఘాలతోను సంఘాల్లోని ప్రముఖులతోను భేటీలు నిర్వహించి మద్దతు కూడగట్టాలని కేసీయార్ మంత్రరులను ఆదేశించటమే ఉదాహరణ. కేసీయార్ నుండి ఆదేశాలు రావటం ఆలస్యం వెంటనే మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పక్కనపెట్టేసి కామారెడ్డిలతో పర్యటించారు.

నిజానికి కేసీయార్ నామినేషన్ వేస్తే చాలు గెలిచిపోవాలి. ఎందుకంటే తెలంగాణాలో దేశంలోనే మరో రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి చేశారు కాబట్టి. దేశంలోని మరే రాష్ట్రంలోను జరగనంతటి సంక్షేమపథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కాబట్టి. అభివృద్ధి, సంక్షేమపథకాల్లో అంత ఘనంగా ముందుకు తీసుకెళుతున్న కేసీయార్ మరి కామారెడ్డిలో ఎందుకని కులసంఘాల నేతలతో మీటింగులు పెట్టిస్తున్నట్లు ? ముస్లిం సంఘాలు, పెద్దలతో మంత్రి మహ్మద్ ఆలీ ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నారు.

ముస్లింల ఓట్లన్నీ కేసీయార్ కు వేసి గెలిపించాలని రిక్వెస్టుచేశారు. గౌడ్ సామాజికవర్గం పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ సామాజికవర్గంలోని పెద్దలతో శాసనమండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, రెడ్డి సంఘాలతోను, సంఘాల్లోని పెద్దలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసీయార్ చెప్పుకుంటున్నట్లు నిజంగానే అభివృద్ధి, సంక్షేమపథకాలను అంత ఘనంగా అమలుచేస్తున్నదే నిజమైతే ఎన్నికల సమయంలో కులసంఘాలతో, పెద్దలతో మీటింగులు పెట్టుకుని ఓట్లేయమని బతిమలాడుకోవాల్సిన అవసరం ఏముంది ?

ద్వితీయ శ్రేణి నేతలను ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలమేయమని, బీఆర్ఎస్ లోకి లాగేయమని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ? కేసీయార్ చెబుతున్నదంతా నిజంగా నిజమే అయితే ఇతర పార్టీల్లోని నేతలే తమంతట తాముగానే బీఆర్ఎస్ లో చేరిపోతారు కదా. మామూలు జనాలు కూడా సామాజికవర్గాలను పట్టించుకోకుండా, పార్టీలను లెక్కచేయకుండా మూకుమ్మడిగా కేసీయార్ కు ఓట్లేసి గెలిపించుకోవాలి. కానీ ఇక్కడ అలాగే జరుగుతోందా ? పూర్తి విరుద్ధంగా జరుగుతోందని అందరికీ అర్ధమవుతోంది. అందుకనే కేసీయార్లో కామారెడ్డి టెన్షన్ పెరిగిపోతోంది.

Tags:    

Similar News